జాతీయ వార్తలు

ఉద్రికతకు దారితీసిన ‘అత్యాచార’ ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 25: బాలికపై అత్యాచార ఘటన ఢిల్లీ వసంత్‌కుంజ్ ప్రాంతంలో ఉద్రిక్తతకు దారితీసింది. ఘటనతో రెచ్చిపోయిన ఆందోళనకారులు రాళ్లు రువ్వుతూ విధ్వంసానికి దిగారు. పలు కార్లు ధ్వంసం కాగా సుమారు పదిమందికి పైగా పోలీసులు గాయాలపాలయ్యారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఇరవైమంది నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పదకొండేళ్ల బాలికపై అత్యాచారం జరిగిన సమాచారం అందుకుంటూనే రంగ్‌పురి పహారీ ప్రాంతంలోని జుగ్గీక్లస్టర్‌కు చెందిన జనం అధిక సంఖ్యలో గుమిగూడి ఆందోళనకు దిగారని డిప్యూటీ పోలీసు కమిషనర్ దేవేందర్ ఆర్య తెలిపారు. వసంత్ కుంజ్ ప్రాంతంలోని ఓ పాఠశాల ఎదుట పెద్దయెత్తున ట్రాఫిక్ జాం ఏర్పడిందని సమాచారం అందుకున్న వెంటనే తమ సిబ్బందిని హెచ్చరించి ఘటనా స్థలానికి పంపామన్నారు. చత్తర్‌పూర్-మహీపాల్ రోడ్డు సమీపంలోని కార్ రింగ్ రోడ్డును ఆందోళనకారులు పూర్తిగా అడ్డుకున్నారని, కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలియజేసినప్పటికీ ఆందోళనకారులు రెచ్చిపోయారని, పోలీసులపై రాళ్లు రువ్వారని ఆర్య తెలిపారు. జనం దాడిలో ఒక పోలీసు అసిస్టెంట్ కమిషనర్, ఇద్దరు సీఐలు, మరో ఏఎస్‌ఐ, ఒక హెడ్‌కానిస్టేబుల్, మరో పదిమంది పోలీసులు గాయాలపాలయ్యారని ఆయన వివరించారు.