జాతీయ వార్తలు

జకీర్ నాయక్ జంప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై, జూలై 11: వివాదాస్పద ఇస్లాం మత ప్రచారకుడు జకీర్ నాయక్ ఇప్పుడప్పుడే భారత్‌కు తిరిగి వచ్చే సూచనలు కనిపించటం లేదు. సౌదీ అరేబియాలో ఆదివారం వరకు ఉన్న జకీర్ ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూలు ప్రకారం సోమవారం ముంబై తిరిగి రావలసి ఉంది. కానీ, ఆయన రెండుమూడు వారాల పాటు ఆఫ్రికా దేశాలలో బహిరంగ సభల్లో ప్రసంగించాల్సి ఉందని జకీర్‌నాయక్ సహచరుడు వెల్లడించారు. ముస్లింలు అందరూ టెర్రరిస్టులుగా మారాలంటూ వ్యాఖ్యలు చేసిన జకీర్ నాయక్ మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశాన్ని సైతం రద్దు చేసారు. ‘‘జకీర్‌నాయక్ విలేఖరుల సమావేశంలో ప్రత్యక్షంగా పాల్గొనాలని ఎప్పుడూ అనుకోలేదు స్కైప్ యాప్ ద్వారానే ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహిస్తారు. విలేఖరుల సందేహాలను నివృత్తి చేస్తారు. ఆయన పర్యటన షెడ్యూలు చాలాకాలం క్రితమే ఖరారైంది. ఉమ్రా పూర్తి చేసుకున్న తరువాత ఆయన జెడ్డాకు వెళ్తారు. అక్కడి నుంచి ఆఫ్రికా వెళ్లి ప్రసంగాలు చేస్తారు. ఆయన భారత్‌కు తిరిగి రావటానికి మరో రెండుమూడు వారాలు పడుతుంది.’’ అని జకీర్ అనుచరుడు తెలిపారు. తనపై నమోదు అయిన కేసుల విచారణ నుంచి జకీర్ తప్పించుకునే ప్రయత్నమేదీ చేయటం లేదని ఆయన స్పష్టం చేశారు.