జాతీయ వార్తలు

అంతర్జాతీయ సరిహద్దుల అభివృద్ధికి మరో రూ.400 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: దేశంలోని 10 రాష్ట్రాల్లో గల అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 400 కోట్ల రూపాయలు విడుదల చేసింది. సుదూరంగా ఉండే ఆయా ప్రాంతాల్లో నివసించేవారి అభ్యున్నతికి ప్రణాళికాబద్ధంగా ఈ నిధులను వెచ్చించనున్నారు. ఈ విషయాన్ని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. దేశంలో అంతర్జాతీయ సరిహద్దుల్లో గల 17 రాష్ట్రాల్లోని వివిధ గ్రామాలను అన్నిరకాలుగా అభివృద్ధిలోకి తీసుకురావడంలో భాగంగా 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 1100 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తోంది. ఈ నిధులకు అదనంగా 10 రాష్ట్రాల్లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో గల గ్రామాల అభివృద్ధికి మరో 400 కోట్ల రూపాయలను కేంద్రం తాజాగా విడుదల చేసింది. జమ్మూ కాశ్మీర్, అస్సాం, హిమాచల్‌ప్రదేశ్, మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో సరిహద్దు ఏరియా డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (బీఏడీపీ) కింద కేంద్ర ప్రభుత్వం రూ.399.44 కోట్లు విడుదల చేసింది. సరిహద్దు ఏరియా డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద 17 రాష్ట్రాల్లోని 111 సరిహద్దు జిల్లాలు అభివృద్ధిలోకి రానున్నాయి. ఆయా ప్రాంతాల్లో అంతర్జాతీయ సరిహద్దులకు 50 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల్లో నివసించే ప్రజల బాగోగులపై దృష్టి సారించనున్నారు. ఆయా గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, సురక్షిత తాగు నీటి సరఫరా, కమ్యూనిటీ సెంటర్లు, రోడ్లు, డ్రైనేజీ వంటి సదుపాయలు కల్పించనున్నారు. స్వచ్ఛ అభియాన్, స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ల కింద ప్రజల్లో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడం, పర్యాటక అభివృద్ధి, చారిత్రక వారసంపదను పరిరక్షించడం, కొండ ప్రాంతాల్లో హెలిప్యాడ్‌ల నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు.