జాతీయ వార్తలు

జనాభా స్థిరీకరణకు సూక్ష్మ ప్రణాళిక: నడ్డా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 11: లక్షిత జనాభా స్థిరీకరణను సాధించటానికి వందకు పైగా జిల్లాల్లో సూక్ష్మ ప్రణాళికను అమలు చేయాల్సి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. దేశ వ్యాప్తంగా 23జిల్లాల్లో సంతాన రేటు నాలుగు శాతం కంటే ఎక్కువగా ఉందని అన్నారు ఉత్తరప్రదేశ్‌లో 11శాతం, బిహార్‌లో 8శాతం ఉన్నట్లు, ఏడు రాష్ట్రాల్లోని 123 జిల్లాల్లో సంతాన రేటు 3 నుంచి నాలుగు శాతం ఉన్నట్లు ఆయన వివరించారు. ‘‘ఈ 123 జిల్లాలకు ఆ 23 జిల్లాలు కలిపి మొత్తం 146 జిల్లాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది’’ అని నడ్డా అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ‘జిమ్మేదారీ నిభావో, ప్లాన్ బనావో’ అన్న నినాదంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ప్రతి జిల్లాకు దాని ప్రత్యేకతలు దానికి ఉన్నాయి. దానినిబట్టి జిల్లాలవారీగా ప్రణాళికలు రచించాల్సిన అవసరం ఉంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. కుటుంబనియంత్రణలో మగవారి భాగస్వామ్యం తగ్గుతోందని, ఈ అంశాన్ని పరిశీలించి, పురుషుల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని మంత్రి అన్నారు. సంతాన రేటును 2.1శాతానికి తగ్గించాల్సిన అవసరం ఉందని.. ఇది చిన్న లక్ష్యం ఏమీ కాదని ఆయన అన్నారు. దీన్ని సవాలుగా తీసుకోవాలన్నారు. శిశుమరణాలు, గర్భవతుల మరణాలను తగ్గించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

చిత్రం.. ‘జిమ్మేదారీ నిభావో, ప్లాన్ బనావో’ అన్న నినాదంపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో గెలుపొందిన బాలలతో కేంద్ర మంత్రులు నడ్డా, అనుప్రియ పటేల్