జాతీయ వార్తలు

సుప్రీం సీజేగా రంజన్ గొగోయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవికి సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ పేరును కేంద్రానికి సిఫార్సు చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా కేంద్రానికి లేఖ పంపారు. అక్టోబర్ 3న రంజన్ గగోయ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అక్టోబర్ 2న ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా పదవీ విరమణ చేయనున్నారు. ఈ మేరకు ఆయన ఒక అధికార లేఖను కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు పంపారు. సుప్రీంకోర్టులో పదవీ విరమణ చేయనున్న ప్రధాన న్యాయమూర్తి తర్వాత సీనియర్ న్యాయమూర్తి పేరును సీజేఐగా సిఫార్సు చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఈ లేఖను న్యాయ శాఖ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళుతుంది. ప్రధాని సిఫార్సు మేరకు భారత రాష్టప్రతి రంజన్ గొగోయ్‌ను ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారు. ఒకవేళ రంజన్ గొగోయ్ నియమాకంపై ఇతర సమస్యలు తలెత్తిన సందర్భం లో సీనియర్ న్యాయమూర్తుల పేర్లను పరిశీలించడం సంప్రదాయంగా వస్తోంది. ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే వారి పేరును ప్రస్తుత సీజేఐ సిఫార్సు చేసినందువల్ల దానిని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని కేంద్ర న్యాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఇటీవల కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ తదుపరి ప్రధాన న్యాయమూర్తి నియామకానికి సంబంధించి పేరును సిఫార్సు చేయాలని సుప్రీంకోర్టును కోరిన విషయం విదితమే. ఈ ఏడాది జనవరిలో నలుగురు న్యాయమూర్తులు సుప్రీంకోర్టు ఆవరణలో ప్రెస్‌మీట్ పెట్టి సీజేఐ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం విదితమే. ఆ నలుగురిలో జస్టిస్ గొగోయ్ ఉన్నారు. జస్టిస్ జే చలమేశ్వర్, మదన్ బీ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ గొగోయ్ ఈ ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు.