జాతీయ వార్తలు

చట్టసభల్లో నియమాలు మార్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఎగువ సభ గౌరవాన్ని పునరుద్ధరించడమే తన ముందున్న ప్రథమ ప్రాధాన్యత అని, తప్పుచేసిన సభ్యులపై చర్యల విషయంలో నియమాలను మార్చాల్సిన అవసరం ఉందని రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతిగా సంవత్సర కాలాన్ని గతనెలలో పూర్తి చేసిన సందర్భంగా ఆయన పీటీఐతో మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం విషయంలో పలు సంస్కరణలు చేపట్టాల్సి ఉందని అన్నారు. ముఖ్యంగా పార్టీ మారిన నేతలపై వచ్చిన ఫిర్యాదులపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని, ఎన్నికలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై త్వరగా విచారణకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎవరైతే పార్టీ మారతారో వారు తమ పదవులకు సైతం రాజీనామా చేయాలని ఆయన అన్నారు. ఇవన్నీ కనీస నైతిక బాధ్యతలని, వీటిని రాజ్యాంగపరమైన బాధ్యతగా కూడా మార్చాలని ఆయన సూచించారు. ఇప్పుడు అమలవుతున్న పార్టీ ఫిరాయింపు నిరోధకచట్టంలో పలు లోపాలున్నాయని, సంబంధిత వ్యక్తులపై విచారణకు నిర్దేశిత కాలపరిమితిని నిర్ణయించలేదని ఆయన చెప్పారు. దారితప్పిన సభ్యులను అదుపుచేసే సమయం వచ్చిందని, అందుకే పార్లమెంట్ నిబంధనలను పునః నిర్మించాల్సిన అవసరం వచ్చిందని, రాజ్యసభ నిబంధనలను సవరించడానికి తాను ఏర్పాటు చేసిన కమిటీ ప్రాథమిక నివేదికను సమర్పించిందని, దీని తుదినివేదిక అక్టోబర్‌లో వస్తుందని ఆయన చెప్పారు. రాజ్యసభ గౌరవాన్ని, గొప్పదనాన్ని నిలబెట్టడం తన బాధ్యత అని అన్నారు. సభ్యుల అనర్హత, ఇతర కేసులకు సంబంధించి వచ్చిన ఫిర్యాదుల విచారణకు ప్రిసైడింగ్ అధికారులు నిర్ణయాలు తీసుకోవడానికి ఐదు సంవత్సరాల సమయం కూడా తీసుకుంటున్నారని, ఇదితప్పని, దీనిని ప్రతి పార్టీ తమకు అనుకూలంగా మలచుకుంటోందని ఆయన చెప్పారు. ఐదు సంవత్సరాల తర్వాత అతని అనర్హతపై నిర్ణయం వస్తే ఏమిటి? రాకపోతే ఏమిటి? అప్పటికే అతని పదవీకాలం పూర్తయిపోతోందని ఆయన అన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని ఉన్న ఈ లోపాలను తప్పక సవరించాల్సిందేనని అన్నారు. ఈ విషయంలో వచ్చిన ఫిర్యాదులను ప్రిసైడింగ్ అధికారులు మూడు నెలల్లో పరిష్కరించాలని అన్నారు. ఈ సందర్భంగా జనతాదళ్ (యునైటెడ్) పార్టీ అభ్యర్థన మేరకు దారితప్పిన ఆ పార్టీ ఎంపీ శరద్‌యాదవ్‌పై మూడు నెలల్లోనే చర్య తీసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. ప్రిసైడింగ్ అధికారి తనదగ్గరకు వచ్చిన అభ్యర్థనపై నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తే అది చట్టం స్ఫూర్తికే విరుద్ధమని వ్యాఖ్యానించారు. అలాగే రాష్ట్రాల్లోని శాసనమండళ్లు పదవులు లేనివారికి, ఎన్నికల్లో గెలవలేని వారికి పునరావాసం కల్పించే కేంద్రాలుగా మారాయని ప్రజలు భావిస్తున్నారన్న ఆరోపణలను ప్రస్తావిస్తూ, ఈ విషయంలో తాను వారితో ఏకీభవించనని అన్నారు. ప్రస్తుతం దేశంలోని 29 రాష్ట్రాల్లో కేవలం ఏడురాష్ట్రాలకు మాత్రమే శాసనమండళ్లు ఉన్నాయని చెప్పారు. ‘వెంకయ్య నాయుడు క్రమశిక్షణ గల వ్యక్తి’ అని ప్రధాని మోదీ ప్రశంసించడాన్ని ఆయన ప్రస్తావిస్తూ క్రమశిక్షణ లేకుండా ఏ దేశం కూడా అభివృద్ధి, బలమైన, సంపద గల దేశంగా మారదని అన్నారు. చైనాలోని కమ్యూనిజం విధానాన్ని తాము అంగీకరించకపోయినా, ఆ దేశంలోని క్రమశిక్షణ వల్లే అంత అభివృద్ధిని సాధించిందన్నారు. జీవితంలో ఎదగడానికి క్రమశిక్షణ అన్నది ఒక సానుకూల అంశమని అన్నారు. రిజర్వేషన్లపై ఆయన మాట్లాడుతూ దీనివల్ల కొంతమందికి లబ్ధి జరిగి తమకు అన్యాయం జరుగుతోందని కొన్ని వర్గాలు భావిస్తున్నాయని, కాని రిజర్వేషన్లు ఉండాల్సిందేనని చెప్పారు. ఈ విషయంలో ఆయా కులాలు, ఉపకులాలు, వర్గాలకు వారి సామాజిక స్థితికి అనుగుణంగా తగిన శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఈ విషయం అన్ని రాజకీయ పార్టీల, పార్లమెంట్, ఇతర చట్టసభల సభ్యులు పరిశీలించాలని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.