జాతీయ వార్తలు

కూలిన్ మిగ్.. పైలట్ క్షేమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, సెప్టెంబర్ 4: ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్‌కు చెందిన మిగ్-27 విమానం మంగళవారం ఉదయం అకస్మాత్తుగా కూలిపోయింది. రాజస్థాన్ జోథ్‌పూర్‌లోని బనద్‌లో కూలిన ఈ యుద్ధవిమానం నుంచి పైలట్ చాకచక్యంగా తప్పించుకోవడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. రోజువారి శిక్షణలో భాగంగానే ఈ మిగ్ విమానం పయనిస్తున్నప్పుడు అకస్మాత్తుగా కూలిపోయిందని, పైలెట్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు రక్షణ శాఖ ప్రతినిధి కల్నల్ సోంబిత్ ఘోష్ వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి విచారణకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. జోథ్‌పూర్ ఎయిర్ బేస్‌నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్ది నిమిషాల్లోనే రష్యాలో తయారైన ఈ విమానం కూలిపోయినట్లు ఆయన చెప్పారు. దంగ్యావాస్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ మిగ్ విమానం కూలిపోవడంతో వెంటనే స్థానిక పోలీసులు అక్కడకు చేరుకున్నారని డిప్యూటీ కమిషనర్ అమన్‌దీప్ సింగ్ కపూర్ తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని ఆయన వెల్లడించారు. ‘ఆకాశంలో రెండు యుద్ధ విమానాలు కనిపించాయని, అయితే వెంటనే ఒకటి అకస్మాత్తుగా పొలాల్లో కూలిపోయిందని’ ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.