జాతీయ వార్తలు

కేసీఆర్ ఓ జోకర్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: మాజీ ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూను విమర్శించటంతోపాటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని బఫూన్ అంటూ విమర్శించిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పెద్ద జోకర్ అని ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా దుయ్యబట్టారు. గురువారం కుంతియా విలేఖరులతో మాట్లాడుతూ ఒక బఫూన్ మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాగలుగుతారని స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన వారెవ్వరూ కూడా గెలిచిన దాఖలాలు లేవు.. అలానే కేసీఆర్ కూడా ఓడిపోవడం ఖాయం అని కుంతియా స్పష్టం చేశారు. శాసనసభ ఎన్నికలకోసం బీజేపీ, టీఆర్‌ఎస్ మినహా ఇతర అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నదని ఆయన చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను త్వరలోనే ప్రకటిస్తామని, ‘కేసీఆర్‌కో హటావో, తెలంగాణకో బచావో’ అన్నదే తమ నినాదమని కుంతియా ప్రకటించారు. చంద్రశేఖరరావు పెద్ద నియంత, హిట్లర్ అంటూ విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనతో చంద్రశేఖరరావుకు భయం పట్టుకుందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేసినట్లు చెప్పుకునే చంద్రశేఖరరావు ధర్నా చౌక్‌ను ఎలా తొలగించారని కుంతియా నిలదీశారు. ఒక నియంత మాత్రమే ఇలా వ్యవహరించ గలుగుతారని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రశేఖరరావు అత్యంత ప్రమాదకర నియంత, శాసనసభ రద్దుతో తెలంగాణలో నియంతృత్వానికి తెరపడిందని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమం చేశారు కాబట్టి వారి కుటుంబంలోని వారంతా మంత్రి పదవులు చేపట్టాలా? అని నిలదీశారు. తెలంగాణకోసం ప్రాణాలు అర్పించిన 1200 మందికి చంద్రశేఖరరావు ప్రభుత్వం ఏం చేసిందని ఆయన నిలదీశారు. కేవలం రెండు వేల మూడు వందల డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించిన ఇచ్చిన సీఎం.. పెద్ద ఎత్తున ప్రగతి సాధించానని ఎలా చెప్పుకుంటారని నిలదీశారు. నాలుగేళ్లపాటు రాష్ట్ర సచివాలయానికి రాని ముఖ్యమంత్రి కూడా ఒక ముఖ్యమంత్రా అని ఆయన ప్రశ్నించారు. చంద్రశేఖరరావు తన ముగింపును తానే రాసుకున్నాడని కుంతియా అన్నారు. తొమ్మిది నెలల ముందే ఎన్నికలకు వెళ్లవలసిన అవసరం ఏమిటనేది ఆయన ప్రశ్నించారు. విభజన హామీలను అమలుచేయని ప్రధాని నరేంద్ర మోదీని కేసీఆర్ ఒకే నెలలో రెండుసార్లు ఎందుకు కలిశారని నిలదీశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కనుమరుగైపోతాయని అన్నారు. ఓటర్ల జాబితాలో దాదాపు పదమూడు లక్షల మంది యువకులను చేర్చవలసి ఉన్నది.. వీరిని చేర్చుకుంటే ఓడిపోతామనే భయంతోనే చంద్రశేఖరరావు ముందస్తు ఎన్నికలకు వెళుతున్నాడని కుంతియా ఆరోపించారు.