జాతీయ వార్తలు

నోట్ల రద్దు ‘పెద్ద’ కుంభకోణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, సెప్టెంబర్ 17: త్వరలో ఎన్నికల జరగనున్న మధ్యప్రదేశ్‌లో సోమవారం రోడ్‌షో ప్రారంభించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. డిమోనిటైజేషన్ పెద్ద కుంభకోణం అని ఆయన ఆరోపించారు. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోడానికే మోదీ ప్రభుత్వం పెద్దనోట్లను రద్దుచేసిందని ఆయన విమర్శించారు. భోపాల్‌లో 11 మంది మతాధికారుల ఆశీస్సులు తీసుకున్న తరువాత రాహుల్ రోడ్‌షోకు బయలుదేరారు. భోపాల్ నగరంలో 15 కిలోమీటర్ల మేర రోడ్‌షో సాగింది. వీధులన్నీ కాంగ్రెస్ జెండాలు, బ్యానర్లతో నింపేశారు. రాహుల్ శివ్‌భక్త్ అంటూ బ్యానర్లు వెలిశాయి. ప్రత్యేక బస్సులో కాంగ్రెస్ అధ్యక్షుడు యాత్రను ప్రారంభించారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు రోడ్‌షోలో పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు, పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్, పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ జ్యోతిరాదిత్య సింధియా రోడ్‌షోకు నాయకత్వం వహించారు. రాహుల్ గాంధీ రోడ్‌షోను సర్దార్ మంజిల్‌లో కాసేపు ఆపారు. రోడ్‌పక్కనే ఓ టీ స్టాల్ వద్ద తేనీరు, సమోసా తీసుకున్న తరువాత రోడ్‌షోను కొనసాగించారు. టీస్టాల్ యజమాని, అక్కడ పనిచేస్తున్నవారితో
రాహుల్‌తో సెల్ఫీలు దిగారు. తమ అధ్యక్షుడి రోడ్‌షోకు ప్రజల నుంచి విపరీతమైన స్పందన వచ్చిందని ఇండోర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జీతు పట్వారీ వెల్లడించారు. బీహెచ్‌ఈఎల్ దసరా మైదాన్‌లో జరిగిన సభలో రాహుల్ మాట్లాడుతూ ‘పెద్దనోట్ల రద్దు వెనక భారీ కుంభకోణం ఉంది. 2016 నవంబర్ 8న 1000, 500 రూపాయల నోట్లను హడావుడిగా రద్దుచేసి అప్పటికప్పుడే అమలు చేయడం వెనక కుంభకోణం దాగి ఉంది’ అని ఆరోపించారు. 15 మంది సంపన్నులకు లబ్ధి చేయడం కోసమే డిమోనిటైజేషన్ తీసుకొచ్చారని ఆయన విమర్శించారు. చిన్న, మధ్యతరగతి వ్యాపారులను దోచి బాడాబాబులకు పెట్టారని మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ ప్రభుత్వం 15 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది బడా పారిశ్రామికవేత్తలకేనని ఆయన ధ్వజమెత్తారు. రైతు రుణమాఫీ హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. నిరర్ధక ఆస్తుల పేరుతో పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేశారని మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తుంది’ అని ఆయన హామీ ఇచ్చారు. ఐదువేల రూపాయలు బాకీ పడితే రైతును ఎగవేతదారుడిగా పేర్కొంటున్న ప్రభుత్వం బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసినవారి పట్ల సానుకూలంగా ఉంటోందని కాంగ్రెస్ చీఫ్ విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యువతకు ఉపాధి కల్పిస్తామని అన్నారు. రోడ్‌షో ప్రారంభించే ముందు 11మంది హిందూ మతపెద్దలను కలిసి వారి ఆశీస్సులు తీసుకున్నారు. 15 కిలోమీటర్ల మేర రోడ్‌షో పూర్తిచేసుకుని బీహెచ్‌ఈఎల్ దసరా మైదాన్‌లో సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడి రోడ్‌షోకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రద్దీగా ఉన్న రోడ్లపై రాహుల్ బస్సు ఎలాంటి ఆటంకాలు లేకుండా వెళ్లడానికి భద్రతా సిబ్బంది కష్టపడాల్సి వచ్చింది. తొలుత రాహుల్‌కు విమానాశ్రయం వద్ద కమల్‌నాథ్, సింధియా స్వాగతం పలికారు.

చిత్రం..రాహుల్