జాతీయ వార్తలు

వచ్చే వేసవికి సాగునీరివ్వాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: పోలవరం ప్రాజెక్టులోని అత్యంత ప్రధాన భాగం ‘ఎర్త్ కమ్ రాక్ ఫీల్డ్’ డ్యామ్ కట్టకుండానే కాఫర్ డ్యామ్‌ద్వారా నీరు మళ్లించి కుడి, ఎడమ కాలువల ద్వారా సాగు నీరు అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉమామహేశ్వరరావు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎర్త్ కమ్ రాక్ ఫీల్డ్ డ్యామ్ కట్టేందుకు దాదాపు ముప్పైవేల కోట్ల రూపాయల అవసరం అవుతుంది. ఈ మొత్తంలో ప్రధాన భాగం నిర్వాసితుల పునరావాసానికే పోతుంది. ఈ ప్రక్రియ ఇప్పుడిప్పుడే పూర్తయ్యే పరిస్థితులు కనిపించటం లేదు. అందుకే యుద్ధ ప్రాతిపదికపై ‘స్పిల్ వే’ నిర్మాణం చేపట్టారు. స్పిల్ వే డ్యామ్ నిర్మాణంలో ప్రస్తుతం 55 శాతం పని పూర్తయింది. స్పిల్ వే డ్యామ్ మొదటి గేటును దసరానాటికి ఏర్పాటు చేయనున్నారు. వచ్చే సంవత్సరం మే, జూన్ నాటికి స్పిల్ వే డ్యామ్‌పై అన్ని గేట్లు ఏర్పాటు చేసి కుడి, ఎడమ కాలువల ద్వారా గ్రావిటీ ఆధారంగా సాగు నీరు అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎర్త్ కమ్ రాక్ ఫీల్డ్ డ్యామ్‌కు ఎగువన నది వైశాల్యం తక్కువ ఉన్నచోట ఒక కాఫర్ డ్యామ్ నిర్మించి కొంతమేర నీరు నిలువ చేయాలనుకుంటున్నారు. ఇలా కాఫర్ డ్యామ్‌ద్వారా నిలవచేసిన నీటిని కుడి, ఎడమ కాలువలకు మళ్లిస్తారు. కాఫర్ డ్యామ్‌ద్వారా మళ్లించే నీటిని స్పిల్ వే డ్యామ్ ద్వారా
అదుపు చేయనున్నారు. కాఫర్ డ్యామ్‌లో నిల్వచేసిన నీటిని కాలువలకు మళ్లిస్తారు. కాఫర్ డ్యామ్‌వద్ద ఆశించిన దానికంటే ఎక్కువ నీరు వచ్చే పక్షంలో దానిని స్పిల్ వే గేట్లద్వారా నదిలోకి వదిలివేస్తారు. స్పిల్ వే ద్వారా వదిలివేసిన నీరు వెనకకు రాకుండా చూసేందుకు దిగవన కూడా ఒక కాఫర్ డ్యామ్‌ను నిర్మిస్తారు. రెండు కాఫర్ డ్యామ్‌లద్వారా అర్త్ కమ్ రాక్ ఫిల్డ్ డ్యామ్ ప్రాంతాన్ని సురక్షితం చేస్తారు. రెండు కాలువల ద్వారా సాగునీరు సరఫరా చేసేందుకు అవసరమైన నీటిని నిల్వ చేసేందుకు ఎగువ కాఫర్ డ్యామ్ ఎత్తు పెంచాలని చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు తెలిసింది. కాఫర్ డ్యామ్ ఎత్తు కొంత పెంచటం వలన ఏ మేరకు ముంపు పెరుగుతుంది.. ఎంతమందిపై ప్రభావం పడుతుంది.. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలనేది పరిశీలనలో ఉన్నది. ముంపు మూలంగా భూములు, ఉపాధి కోల్పోయేవారికి పునరావాసం కల్పించి అర్త్ కమ్ రాక్ ఫిల్డ్ డ్యామ్ నిర్మాణం చేపట్టడం ఇప్పుడిప్పుడే సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించటం లేదు. నిర్మాణం ఎప్పుడు ప్రారంభం అవుతుందనేది కూడా స్పష్టం కావటం లేదు. అందుకు రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరిగేలోగా పోలవరం నీటిని రైతులకు అందజేయటం ద్వారా తమ మాటను నిలబెట్టుకోవాలన్నది చంద్రబాబు పట్టుదల. అందుకే ఆయన ఎగువ కాఫర్ డ్యామ్‌ద్వారా కొంత నీరు నిల్వ చేసి దానిని కుడి, ఎడమ కాలువల ద్వారా రైతులకు అందజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. స్పిల్ వే డ్యామ్ నిర్మాణం పూర్తికాగానే కాఫర్ డ్యామ్‌ల నిర్మాణం ఊపందుకుంటుంది. చంద్రబాబు గత వారం స్పిల్ వే డ్యామ్‌లోని గ్యాలరీని ప్రారంభించటం తెలిసిందే. నవయువ నిర్మాణ సంస్థ రంగంలోకి వచ్చిన తరువాతనే పోలవరంలో నిర్మాణం పనులు వేగం పుంజుకున్నాయి. గ్యాలరీ నిర్మాణం పూర్తి కావస్తోంది కాబట్టి త్వరలోనే స్పిల్ వే డ్యామ్‌పై గేట్లను ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభం అవుతుంది. గేట్ల నిర్మాణం పూర్తయితే ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మాణం ద్వారా నిలువ చేసే నీటిని అదుపు చేసేందుకు వీలు కలుగుతుంది. కుడి, ఎడమ కాలువల రేగ్యులేటర్ నిర్మాణం కూడా వేగంగా జరుగుతోంది. స్పిల్ వే డ్యామ్ గేట్లను ఏర్పాటు చేసే సమయానికి రెగ్యుటర్ల పనికూడా పూర్తి చేస్తామని ఇంజనీర్లు చెబుతున్నారు. రెండు కాలువలు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి కాఫల్ డ్యామ్ నిర్మాణం కాగానే కుడి, ఎడమ కాలువల్లోకి నీరు వదలటం ఖాయమని ఇంజనీర్లు అంటున్నారు.

చిత్రం..నిర్మాణంలో ఉన్న పోలవరం స్పిల్‌వే