జాతీయ వార్తలు

శ్రమదానంలో చేతులు కలపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘స్వచ్ఛతా హీ సేవ’ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా శ్రమదానంలో పాలుపంచుకోవాలని కేంద్రం దేశంలోని అన్ని శాఖలను కోరింది. 15 రోజులపాటు ఏకధాటిగా నిర్వహించే శ్రమదాన్ కార్యక్రమాల్లో భాగంగా దేశవ్యాప్తంగా గల 48.41 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కనీసం ఆరు గంటలపాటు పాల్గొనాలని సంబంధిత కార్యాలయం అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాలకు చెందిన కార్యదర్శులను ఆదేశించింది. ప్రధాని మోదీ ఈనెల 15న ప్రారంభించిన ‘స్వచ్ఛతా హీ సేవ’ అనే బృహత్కార్యం అక్టోబర్ రెండో తేదీ గాంధీ జయంతి వరకు నిరంతరం కొనసాగాలని పేర్కొంది. ఉద్యోగులు తమ కార్యాలయాలను శుభ్రపరిచే కార్యక్రమంలో చురుకుగా పాల్గొనడంతోపాటు నివాసిత కాలనీలు, సాధారణ పౌరులు నివసించే ప్రాంతాల్లో మురుగు కాల్వలు, మరుగుదొడ్లు శుభ్రం చేయడంతోపాటు ప్రజల్లో శ్రమదానం ఆవశ్యకత గురించి ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని సూచించింది. శ్రమదానం కార్యక్రమంలో స్థానికులు సమర్ధవంతమైన పాత్రను పోషించేందుకు వారిలో చైతన్యం తీసుకురావాలని కోరింది. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాని తన ప్రసంగంలో శ్రమదానం కార్యక్రమంలో కేవలం ఉద్యోగులే కాకుండా సాధారణ పౌరులు సైతం ఉత్సాహంగా, చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. పూజ్య బాపూజీ చిరకాల కల ‘క్లీన్ ఇండియా’లో ‘జన్ ఆందోళన్’ (ప్రజా ఉద్యమం)లో తాము చేపట్టే కార్యక్రమానికి జనం చేతులు కలపాలని ప్రధాని కోరారు. కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా వారి బంధుమిత్రులు, స్నేహితులు కూడా 15 రోజుల పాటు నిర్వహించే శ్రమదానంలో కనీసం ఆరు గంటలైనా ఇందుకోసం వెచ్చించాలని సంబంధిత మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.