జాతీయ వార్తలు

గుజరాత్ ఎమ్మెల్యేల వేతనాలు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధీనగర్, సెప్టెంబర్ 19: ఎమ్మెల్యేల వేతనాలను పెంచుతూ గుజరాత్ ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం లభించింది. దీంతో ఈ ప్రజాప్రతినిధుల కనీస వేతనం రూ.45000కు చేరుకుంది. ఎమ్మెల్యే నెల వేతనం రూ.70,727 ఉండగా ఇప్పుడది రూ.1,16,000కు చేరుకుంటుంది. అంటే 64 శాతం పెరుగుదల. అలాగే అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ప్రతిపక్ష పార్టీ నేతకున్న వేతనం రూ.86,000 నుంచి రూ.1.32 లక్షలకు పెరుగుతుంది. ఇది 54 శాతం పెరుగుదల. పెంచిన వేతనాలు 2017 ఫిబ్రవరి నుంచి అమలు కానుండడంతో దాదాపు 6 కోట్ల రూపాయలు బకాయిల రూపంలో చెల్లిస్తారు. పెంచిన వేతనాల వల్ల రాష్ట్ర ఖజానాపై ఏడాదికి 10కోట్ల రూపాయల భారం పడనుంది. ఎమ్మెల్యేల వేతనాల పెంపునకు సంబంధించిన బిల్లును రాష్ట్ర మంత్రి ప్రదీప్ సింగ్ జడేజా అసెంబ్లీలో ప్రవేశపెట్టగా, సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.