జాతీయ వార్తలు

ఎంపీలో ఓటింగ్ కంపార్టుమెంట్ల కొను‘గోల్’మాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, సెప్టెంబర్ 19: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓటింగ్ కంపార్ట్‌మెంట్ల కొనుగోలులో తీవ్ర అవినీతి చోటు చేసుకుందని సామాజికవేత్త అజయ్ దుబే ఆరోపించారు. ఈ కంపార్టుమెంట్లను అధికారులు వివిధ జిల్లాల్లో ఒక్కొక్కరూ ఒక్కో ధరకు కొనుగోలు చేశారని, దీనిలో తీవ్ర అవకతవకలు జరిగాయని, భారీగా సొమ్ములు చేతులు మారాయని, ఆయన విమర్శించారు. ఒక ప్రైవేట్ సంస్థ నుంచి వివిధ రేట్లకు అధికారులు వీటిని కొనుగోలు చేసిన విషయం తాము సమాచార హక్కు ద్వారా దరఖాస్తు చేసి తెలుసుకున్నామని ఆయన చెప్పారు. త్వరలో ఇక్కడ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ అవకతవకలతో బీజేపీ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్‌కు ఇబ్బందులు తప్పవని ఆయన హెచ్చరించారు. కలెక్టర్, ఎన్నికల అధికారి అయిన మోరెనా ప్రొగ్రెసివ్ కన్సలెంట్ అనే సంస్థకు 1800 ఓట్ కంపార్టుమెంట్ల సరఫరా చేసినందుకు ఒక్కో యూనిట్‌కు 1936 రూపాయల చొప్పున చెల్లించారని ఆయన చెప్పారు. అదే సమయంలో ఇండోర్ జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ ఒక్కొక్క యూనిట్‌ను 1134 రూపాయల చొప్పున 3500 యూనిట్లను కొనుగోలు చేశారని చెప్పారు. అలాగే పొరుగున ఉన్న హోషంగబాద్ జిల్లాలో డిప్యూటీ ఎలక్షన్ ఆఫీసర్ 1078 రూపాయలకు 1175 కొనుగోలు చేశారన్నారు. ఇదేవిధంగా రాష్ట్ర ఎన్నికల అధికారులు రాజఘర్, ఛత్రాపూర్ జిల్లాల్లో ఒక్కో యూనిట్ 1752 రూపాయల చొప్పున కొన్నారన్నారు. ఓటు వేసేటప్పుడు ఓటరు ప్రైవసీని, ఈవీఎంల రక్షణకు ఉపయోగపడే ఈ ఓటింగ్ కంపార్టుమెంట్లను ఒక్కో జిల్లాలో ఆయా అధికారులు ఒక్కో రేటుకు కొనుగోలు చేశారని దుబే ఆరోపించారు. వీటి కొనుగోలుకు సంబంధించి ఎంపీ ప్రభుత్వం ఎలాంటి టెండర్‌ను పిలవలేదని ఆయన చెప్పారు. వీటి కొనుగోళ్లలో జరిగిన లక్షలాది రూపాయల అవినీతిపై తాను భారత ఎలక్షన్ కమిషన్‌కు పిర్యాదు చేయనున్నట్టు ఆయన తెలిపారు.