జాతీయ వార్తలు

పంజాబ్ స్థానిక సంస్థలకు పోలింగ్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, సెప్టెంబర్ 19: పంజాబ్ స్థానిక సంస్థలకు పోలింగ్ పూర్తయంది. గురువారం ఉదయం 8నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరిగింది. కౌంటింగ్ ప్రకియను ఈ నెల 22న నిర్వహించనున్నారు. పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్ శిరోమణి ఆకలి దళ్ నాయకులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆకలి దళ్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బడాయ మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలు చాలాచోట్ల పోలింగ్ బూత్‌లలో కత్తులతో కనిపించినట్లు ఆరోపించారు. ఇంత జరిగినా పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహించారని పేర్కొన్నారు. అంతకుముందు ఆకలి దళ్ నేతల నామినేషన్లను రిజెక్ట్ చేశారని, చాలాచోట్ల బోగస్ ఓట్లు పోల్ అయనట్లు ఆరోపించారు. రాజాసాన్సి, అమృత్‌సర్, జోకేహరిహర్‌లోని ఫిరోజ్‌పుర్, లోధి గుజ్జర్‌లోని అజ్నాలా, సోహియా కలాన్ మజితాలో కొంతమంది కార్యకర్తలు రాళ్లు రువ్వడం, కర్రలతో దాడి ఘటనలకు పాల్పడగా చాలామంది గాయపడినట్లు చెప్పారు. రూలింగ్ పార్టీ గెలుపు కోసం చాలాచోట్ల పోలీసులను బందోబస్తును వాడుకుందని, గెలిచేందుకు వ్యతిరేక వర్గ నాయకలను భయబ్రాంతులకు గురిచేసిందన్నారు. రాష్ట్రంలో 22 జిల్లా పరిషత్, 150 పంచాయతీ సమితిలకు జిల్లా పరిషత్ 354, పంచాయతీ స్థానానికి 2,900 అభ్యర్థులు బరిలో నిలిచారు.

చిత్రం..అమృత్‌సర్ శివార్లలో బుధవారం బారులు దీరిన ఓటర్లు