జాతీయ వార్తలు

కఠిన నిర్ణయాలు ఆగవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20:దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రానున్న ఏడేళ్ల కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఐదు ట్రిలియన్ డాలర్లకు పెరుగగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇందులో వ్యవసాయం, ఉత్పాదక రంగం వాటా ఒక ట్రిలియన్ డాలర్ల మేర ఉంటుందని వెల్లడించారు. గురువారంనాడిక్కడ ఇండియా ఇంటర్నేషనల్ కనె్వన్షన్, ఎక్స్‌పో సెంటర్‌కు శంకుస్థాపన చేసిన సందర్భంగా మోదీ మాట్లాడారు. ఈ వేదికకు ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ మెట్రోలోనే ఆయన రావడం గమనార్హం. ప్రజాప్రయోజనాల కోసమే తమ ప్రభుత్వం ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకుందని, అలాంటి నిర్ణయాలు భవిష్యత్‌లో కూడా కొనసాగుతాయని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ ఎప్పటికప్పుడు కొత్త శక్తిని సంతరించుకుంటోందని అన్నారు.ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ 8శాతం వృద్ధి రేటుతో ముందుకు సాగుతోందని రానున్న ఐదు నుంచి ఏడేళ్ల కాలంలో ఐదు ట్రిలియన్ డాలర్లకు, పదేళ్ల కాలంలో పది ట్రిలియన్ డాలర్లకు పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని తెలిపారు. దేనా బ్యాంక్, విజయా బ్యాంకులను బ్యాంక్ ఆఫ్ బరోడాతో విలీనం చేయాలని కేంద్రం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘డజన్ల కొద్దీ ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండాల్సిన అవసరం ఏమిటి? గత కొనే్నళ్లుగా ఈ అంశం గురించి చర్చించారే తప్ప ఎవరూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’అని మోదీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ పథకం గురించి మాట్లాడిన ప్రధాని ‘్భరత ప్రభుత్వం మొబైల్ ఫోన్ల తయారీకి కూడలిగా మారింది. గత నాలుగు సంవత్సరాల్లో 4-5లక్షల మందికి ఉపాధిని కల్పించింది. దరిమిలా మూడు లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని పొదుపు చేసుకోగలిగాం’అని తెలిపారు. సులభతర వ్యాపారాన్ని పెంపొందించేందుకు జిల్లాస్థాయిల్లో కూడా తమ ప్రభుత్వం పథకాలను రూపొందిస్తోందని, దీని వల్ల స్థూల జాతీయోత్పత్తి పెరిగే అవకాశం ఉంటుందని ప్రధాని తెలిపారు.

చిత్రాలు.. ఎయర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ
*ఇండియా ఇంటర్నేషనల్ కనె్వన్షన్, ఎక్స్‌పో సెంటర్‌కు శంకుస్థాపనలో ప్రధాని మోదీతో
కేంద్ర విమానయాన శాఖ మంత్రి సురేశ్‌ప్రభు