జాతీయ వార్తలు

గోవా కేబినెట్‌లో స్వల్ప మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజి, సెప్టెంబర్ 24: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తన మంత్రివర్గంలో స్వల్ప మార్పులు చేశారు. ఇద్దరు మంత్రులను తొలగించి వారి స్థానంలో మరో ఇద్దరిని చేర్చుకున్నారు. ఏడాదిన్నర పాలనలో మంత్రివర్గంలో మార్పులు చేయడం ఇది రెండోసారి. తొలగించిన వారిలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఫ్రాన్సిస్ డిసౌజా, విద్యుత్ శాఖ మంత్రి పాండురంగ మద్‌కైకర్ ఉన్నారు. వారి స్థానంలో బీజేపీ ఎమ్మెల్యేలు నీలేష్ కబ్రాల్, మిలింద్ నాయక్‌లను చేర్చుకున్నారు. రాజ్‌భవన్ జరిగిన కార్యక్రమంలో గవర్నర్ మృదులా సిన్హా కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పారికర్ హాజరు కాలేదు. ఆయన ప్రస్తుతం ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. గత కొద్ది రోజులుగా పారికర్ పంక్రియాస్‌కు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నప్పటికీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక అనారోగ్యానికి గురైన డిసౌజా అమెరికాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, మద్‌కైకర్ గత జూన్‌లో మెదడుకు సంబంధించిన వ్యాధితో చికిత్స పొందుతున్నారు. వీరి అనారోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వారిని పదవుల నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ఇలావుండగా రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని, బల నిరూపణకు సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. ఇప్పటికే బీజేపీ అధిష్ఠానం ముగ్గురు సభ్యుల బృందాన్ని గోవాకు పంపి బీజేపీ నేతలు, మిత్రపక్షాల నేతలు చర్చలు జరిపారు.