జాతీయ వార్తలు

ఇక సరికొత్త శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: సెంట్రల్ రిజర్వ్ ప్రొటక్షన్ ఫోర్సు (సీఆర్ పీఎఫ్) ఇక తన పాత శిక్షణ పద్ధతులకు స్వస్తి పలకబోతోంది. సిఆర్‌పిఎఫ్‌లోకి కొత్తగా చేరిన వారికి ఇచ్చే శిక్షణలో ఉన్న లోపాలను అధిగమించడానికి ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్రైనింగ్ సమయంలో శారీరక శిక్షణలో పలువురు సైనికులు గాయపడుతున్నారు. ఈ గాయాల తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటుందంటే వారిలో కొందరు జీవితాంతం గాయాలతో బాధపడుతున్నారు. మరికొందరు శిక్షణలో వికలాంగులై ఉద్యోగానికి అనర్హులై అర్థాంతరంగా వెళ్లిపోతున్నారు. సీఆర్‌పీఎఫ్‌లో ప్రతి ఏడాది కానిస్టేబుల్, అసిస్టెంట్ కమాండెంట్, కేడెట్స్‌గా వేలాది మంది నియమితులవుతున్నారు. ఆర్మీలో మెగా రిక్రూట్‌మెంట్ ర్యాలీ చేపడతామని కొద్ది నెలల క్రితం కేంద్రం ప్రకటించింది. దానిలో భాగంగా వివిధ దళాల్లో మొత్తం 54,953 మందిని నియమిస్తుండగా, అందులో సీఆర్ పీఎఫ్‌లోనే 21,566 మందిని రిక్రూట్ అవుతున్నారు.
ఇలా నియమితులైన వారిలో అందరూ విజయవంతంగా శిక్షణ పూర్తి చేయలేకపోతున్నారు. కఠినమైన వ్యాయామం, టాస్క్‌ల వల్ల కొందరు అభ్యర్థులు మధ్యలోనే గాయాలతో వెనుదిరుగుతున్నారు. ఎన్నో ఆశలతో సైన్యంలోకి వద్దామనుకుంటే ఈ కఠిన శిక్షణ వల్ల ఉద్యోగం మాట దేవుడెరుగు.. వికలాంగులుగా మిగిలిపోయామని పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శిక్షణ విధానంపై వస్తున్న విమర్శల నేపథ్యంలో దానిని మార్చడానికి సిఆర్‌పిఎఫ్ నిర్ణయం తీసుకుంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా శిక్షణ విధానాన్ని రీ డిజైనింగ్ చేసినట్టు సీఆర్ పీఎఫ్ డైరెక్టర్ జనరల్ (డీజీ) ఆర్. భట్నాగర్ పీటీఐకి తెలిపారు. ఎంపిక చేసిన సైనికుల శిక్షణ సమయంలో చాలామంది గాయపడుతున్నారని ఆయన చెప్పారు. ఎముకలు స్వల్పంగా విరగడం, కొందరికి పూర్తిగా విరగడం జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో శారీరక శిక్షణ విధానాన్ని పూర్తిగా మార్చాలని నిర్ణయించామన్నారు. శాస్ర్తియపద్ధతులో ప్రతి సైనికునికి జాగరుకతతో శిక్షణ ఇచ్చి కఠిన పరిస్థితులు ఎదుర్కొనేలా దృఢమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతామన్నారు. ఇప్పుడు నిర్వహిస్తున్న శిక్షణ విధానంలో పలువురు తీవ్రంగా గాయపడి, ఉద్యోగానికి అనర్హులవుతున్నారని, కొందరు జీవితాంతం గాయాలతో బాధపడుతున్నారని, ముఖ్యంగా కొందరికి తల, ఇతర సున్నిత ప్రదేశాలలో గాయలవుతున్నాయని ఆయన చెప్పారు. సైనిక శిక్షణ తమను వికలాంగులను చేస్తుందేమోనని కొందరు భయపడుతున్నారని అన్నారు. అందుకే శారీరక శిక్షణ విధానంలో మార్పులు తీసుకువస్తున్నామన్నారు. శిక్షణతో సైనికుడిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, పూర్తి శిక్షణతో పరిపూర్ణమైన వ్యక్తిగా బయటకు వస్తాడని, తోటివారికి స్ఫూర్తి అవుతాడని ఆ దిశగా తాము చర్యలు తీసుకుంటున్నామని డిజి తెలిపారు. ముఖ్యంగా నక్సల్స్, ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి అవసరమైన పూర్తి శిక్షణ ఇస్తామన్నారు. సీఆర్ పీఎఫ్ జవాన్ బలంగా, ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలన్నది తమ లక్ష్యమన్నారు. ఈ నేపథ్యంలో సైనిక శిక్షణ కేంద్రాల్లో సైతం పలుమార్పులు చేస్తున్నామన్నారు. శిక్షణలో సైనికుడు గాయపడినా అది స్వల్ప గాయమే అయ్యిఉండేలా నూతన శిక్షణ విధానం ఉంటుందని డీజీ భట్నాగర్ పీటీఐకి తెలియజేశారు.