జాతీయ వార్తలు

జవాబు పత్రాలపై దేవుళ్ల పేర్లు రాయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, సెప్టెంబర్ 4: జవాబు పత్రాలపై దేవుళ్ల పేర్లు, మరేదైనా మతపరమైన కామెంట్లు రాసే విద్యార్థుల తీరును కర్నాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైనె్సస్ అధికారులు తప్పుపట్టుతున్నారు. మానవతా దృక్ఫథంతో కాకుండా మరోకోణంలో వారు ఆలోచిస్తూ ఆంక్షలు విధిస్తున్నారు. దేవుడిమీద భక్తితో కొంతమంది అలా రాస్తుండవచ్చు, కానీ చాలామంది జవాబు పత్రాలపై తమ ఐడెంటిటీని తెలిపేందుకు, మూల్యాంకనం చేసేవారిని ప్రభావితం చేసి అధికమార్కులు వేయించుకునేందుకు వినియోగిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని ఆ అధికారులు చెబుతున్నారు. పరీక్షల్లో జవాబు పత్రాలపై ఇలాంటివి రాస్తే మాల్ ప్రాక్టీస్‌గానే పరిగణించాల్సివుంటుందని విద్యార్థులకు ఆ వర్శిటీ అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. చాలామందికి ఏదైనా రాసేటప్పుడు ఓం అనిగానీ, శ్రీరామ జయం అనిగానీ మరేదైనా సెంటిమెంట్‌గా రాయడం పరిపాటి. ఐతే అలా రాయడాన్ని కాపీలు కొట్టడం వంటి మాల్‌ప్రాక్టీస్‌గానే పరిగణిస్తామని అన్ని అనుబంధ కళాశాలలకు ఆ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ (ఎవాల్యువేషన్) డాక్టర్ ఎంకే రమేష్ సర్క్యులర్లు జారీ చేశారు. ఇందులో పరీక్షలు రాసే సమయంలో చేయకూడనివి అనే ఎనిమిది నిబంధనలను పొందుపర్చారు. 3వ పేజీ ప్రారంభం నుంచి దేవుళ్ల పేర్లు రాయడం , పేజీ చివరిలో పీటీవో అనిరాయడం, సంబంధం లేని వ్యాఖానాలు చేయడం, అంకెలు వేయడం, సంతకాలు చేయడం, చిహ్నాలు వేయడం, లేఖలను జతచేయడం, జవాబు పత్రాన్ని చింపడం వంటివి చేయరాదని ఆదేశాల్లో పేర్కొన్నారు. అలాచేస్తే తదుపరి అవినీతికి విద్యార్థులు తమ ఐడెంటిటీని తెలియజేసుకున్నట్లు భావించాల్సివస్తుందని డిప్యూటీ డైరెక్టర్ (ప్రీ ఎగ్జామినేషన్స్) సంధ్యా అవధాని పేర్కొన్నారు. ఇలాంటివి చేయడం ద్వారా మూల్యాంకనం సమయంలో అధిక మార్కులు వేసుకునేందుకు చాలామంది ఆ సింబల్స్‌ను వాడుకుంటున్నారని తమ దృష్టికి వచ్చిందని ఆమె అన్నారు. ఇదివరకే ఇందుకు సంబంధించి ఆదేశాలు జారీ చేసినప్పటికీ ప్రతియేటా కొత్త విద్యార్థులు వస్తుంటారు కాబట్టి తాజాగా ఈ సర్క్యులర్ జారీ చేయాల్సి వచ్చిందని తెలిపారు.