జాతీయ వార్తలు

30 ఏళ్ల వరకు ఫిర్యాదు చేయవచ్చు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: లైంగిక వేధింపులకు గురైన బాలబాలికలు ముఫ్పై ఏళ్ల వయసు వచ్చే వరకు వారికి జరిగిన అన్యాయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు అనుమతించేలా కృషి చేస్తున్నామని కేంద్ర మహిళా శిశు సంక్షేమ, అభివృద్ధి శాఖ మంత్రి మేనకాగాంధీ తెలిపారు. ఇందుకు సంబంధిచిన ప్రతిపాదన తమ పరిశీలనలో ఉందని ఆమె తెలిపారు. సీఆర్‌పీసీ సెక్షన్ 468 మేరకు బాలల లైంగిక వేధింపులతోబాటు, మరేదైనా ఘటనలు చోటుచేసుకుంటే మూడేళ్లలోపే పోలీసులకు ఫిర్యాదులు చేయాల్సివుంటుంది. ఇందుకు సంబంధించి ఆలస్యంగా వచ్చే ఫిర్యాదులపై విచారణ చేపట్టే విషయంలో సంబంధిత న్యాయమూర్తుల విజ్ఞతపై, లేదా ఆలస్యానికి సరైన కారణాలు చూపిన అంశంపై ఆధారపడివుంటుందని సీఆర్‌పీసీ సెక్షన్ 473 పేర్కొంటోంది. ఈ క్రమంలో ఎఫ్‌ఐఆర్ చేయడంలో ఆలస్యమయ్యే కేసుల్లో బాధిత యువతులకు 18 ఏళ్లు దాటితే ఇబ్బందులకు గురికావాల్సి వస్తోందని మంత్రి మేనకా గాందీ చెప్పారు. అందుకే ఈ విషయంలో నిబంధనలను సడలించి బాధితులు 30 యేళ్ల వయసు వచ్చే వరకు ఫిర్యాదు చేసే అవకాశం ఇచ్చేందుకు ప్రతిపాదించడం జరిగిందన్నారు. హోం మంత్రిత్వ శాఖకు ఈ ప్రతిపాదనను పంపించి వారి అంగీకారాన్ని కూడగట్టాలని నిర్ణయించామన్నారు. కొంతమందికి భయంవల్లనో మరేకారణం చేతనో అన్యాయం జరిగిన వెంటనే ఫిర్యాదు చేసే అవకావం లేకపోవచ్చు. జీవితంలో పరిణతి చెందిన తర్వాత తమకు జరిగిన అన్యాయాన్ని ఎదుర్కోలేకపోయామన్న భావన కుంగదీయవచ్చు. అలాంటి వారికి వెన్నుదన్నుగా ఉండేలా ఈ కొత్త ప్రతిపాదన రూపొందించామని మంత్రి చెప్పారు. తమ శాఖ వద్ద లైంగిక వేధిపులకు పాల్పడిన వారి రిజిస్టర్ వుందని, ఇందులో నాలుగున్నర లక్షల మంది నిందితుల పేర్లు నమోదై వున్నాయని ఆమె వివరించారు.