జాతీయ వార్తలు

విద్యార్హతలను చూపించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: సమాచార చట్టం ప్రకారం కోరిన విజ్ఞప్తి మేరకు తన డిగ్రీని, ఇతర విద్యార్హతలను బహిర్గతం చేసేందుకు అంగీకరించని పంజాబ్‌లోని భోలత్‌కు చెందిన ఆమ్‌ఆద్మీ పార్టీ శాసనసభ్యుడు సుఖ్‌పాల్ సింగ్ ఖైరా వైఖరిపై కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. అతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని వ్యాఖ్యానించింది. ఓ ప్రజాప్రతినిధి ప్రజావిజ్ఞప్తిని తిరస్కరించడం తగదంటూ సమచార చట్టం ప్రకారం కోరిన వ్యక్తికి ఇందుకు సంబంధించిన వివరాలను అందజేయాల్సిందిగా చండీగడ్‌లోని డీఏవీ కళాశాలను కేంద్ర సమాచార కమిషనర్ దివ్యప్రకాష్ సిన్హా ఆదేశించారు. మూడో వ్యక్తికి సమచారం అదించడంగా దీన్ని భావించరాదన్నారు. కాగా సీఐసీ ఆదేశాల మేరకు వివరాలు అందించేందుకు తనకెలాంటి అభ్యంతరం లేదని, అ సమాచారం తన ఎన్నికల అఫిడవిట్‌లో సైతం భాగమని, ప్రస్తుతం ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో ఉందని ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరా పేర్కొన్నారు. శశిపాల్ అనే వ్యక్తి ఖైరా విద్యార్హతలపై వివరాలు ఇవ్వాల్సిందిగా కోరినా సంబంధిత కళాశాల ఇవ్వకపోవడంతో అతను ఈ విషయంపై కేంద్ర సమాచార కమిషన్‌లో అప్పీలు చేశాడు. ఈ క్రమంలో గురువారం ఈ కేసు హియరింగ్‌కు రావడంతో వివరాలు ఇవ్వకపోవడానికి గల కారణాలు తెలపాల్సిందిగా కమిషనర్ సిన్హా డీఏవీ కళాశాలను ఆదేశించారు. ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరిచిన అంశాలు జనబాహుళ్యానికి సంబంధించినవేనని, ఇందులో పారదర్శకత వుండాలేకానీ, దాపరికాలు తగవని సిన్హా వ్యాఖ్యానించారు.
డీఏవీ కళాశాలలో తాను 2017లో బిఏ రెండో సంవత్సరం చదివినట్లు, అదే తన అత్యధిక విద్యార్హతగా ఖైరా ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇలావుండగా ఢీల్లీ విశ్వవిద్యాలయం 1978 బ్యాచ్ విద్యాసంవత్సరం రికార్డులను పరిశీలించాల్సిందిగా గతంలో సమాచార కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు ఆదేశించారు. అదే ఏడాది ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ఈ విశ్వవిద్యాలయం నుంచి ఉత్తీర్ణుడయ్యారు. అలాగే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ 10, 12 తరగతుల విద్యాభ్యాసానికి సంబంధించిన రికార్డులను సైతం పరిశీలించాలని కమిషనర్ ఆదేశించడం జరిగింది. అయితే ఆ ఆదేశాలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది.