జాతీయ వార్తలు

శబరిమల ఆలయ ప్రకంపనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, అక్టోబర్ 4: శబరిమల ఆలయంలో అన్ని వయసుల మహిళల ప్రవేశానికి వీలు కల్పిస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలు రాజకీయంగా వివాదంగా మారాయి. సుప్రీంకోర్టు తీర్పును సవాలు చేస్తూ రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు డిమాండ్ చేస్తుండగా, సీపీఎం మాత్రం రివ్యూ పిటిషన్‌కు ససేమిరా అంటోంది. ఈ విషయమై సీనియర్ కాంగ్రెస్ నేత రమేష్ చిన్నితల మాట్లాడుతూ ప్రజల విశ్వాసాలను భంగపరిచే చర్యలను అంగీకరించమని చెపద్పారు. శబరిమల ఆలయాన్ని పర్యవేక్షిస్తున్న ట్రావెన్‌కోర్ బోర్డు మాజీ అధ్యక్షులు, సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. హిందువుల విశ్వాసాల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. బీజేపీ, ఆరెస్సెస్‌కూడా కేంద్రంపై వత్తిడి తేవాలన్నారు. హిందువుల మనోభావాలను పరిరక్షించేందుకు కృషి చేసే ఉద్దేశ్యం ఉంటే, బీజేపీ, ఆరెస్సెస్‌లు కేంద్రాన్ని నిలదీయాలని ఆయన కోరారు. భక్తులను మోసం చేసే విధంగా వ్యవహరించరాదని ఆయన బీజేపీని కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీ శ్రీ్ధరన్ పిళ్లై మాట్లాడుతూ, కోర్టు తీర్పును నిరసిస్తూ జరుగుతున్న ఉద్యమానికి మద్దతు ఇస్తామన్నారు. సీపీఎం పార్టీ హిందువుల సెంటిమెంట్లతో ఆడుకుంటోందన్నారు. ఇప్పటికే తమ పార్టీ అనుబంధ సంఘాలు తీర్పును నిరసిస్తూ ఉద్యమంలో కీలకపాత్ర వహిస్తున్నాయన్నారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలన్నారు. కాగా బీజేపీకి చెందిన మహిళా మోర్చా ఇక్కడ ట్రావెన్‌కోర్ ఆలయ బోర్డు వద్ద ధర్నా నిర్వహించింది. ఆలయ సంప్రదాయాలను కాపాడాలని కోరారు. బీజేపీ మహిళా మోర్చా నేత శోభా సురేంద్రన్ మాట్లాడుతూ శబరిమల ఆలయ సంప్రదాయాలను నాశనం చేయాలని సీపీఎం ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. రోడ్డుపైన మహిళలు బైఠాయించి నినాదాలు చేశారు. అంతకు ముందు కేరళ ప్రభుత్వం ఉన్నతాధికారులతో సమావేశమై ఎటువంటి పరిస్థితిని సమీక్షించింది. రివ్యూ పిటిషన్ దాఖలు చేయరాదని నిర్ణయించింది. కాగా రివ్యూ పిటిషన్ దాఖలు చేయరాదన్న కేరళ ప్రభుత్వ నిర్ణయాన్ని నాయర్ సర్వీసు సొసైటీ తప్పుబట్టింది. ఇది దురదృష్టకరమైన నిర్ణయమని ఈ సంఘం పేర్కొంది. ఆలయ భక్తుల సంప్రదాయాలను, మతవిశ్వాసాలను పరిరక్షిస్తామని చెప్పిన ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని ఎన్‌ఎస్‌ఎస్ అధ్యక్షుడు జీ సుకుమారన్ నాయర్ డిమాండ్ చేశారు. ఆలయ సంప్రదాయాలను ఎలా కాపాడుతారని ఆయన నిలదీశారు. తక్షణమే ఈ విషయమై రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.