జాతీయ వార్తలు

ఫోరెన్సిక్ ఆడిట్ జరపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: రాఫెల్ ఫైటర్ జెట్ల కొనుగోలుకు సంబంధించి కుదిరిన 60,150 కోట్ల ఒప్పందానికి సంబంధించి సమగ్ర ఆడిట్‌ను నిర్వహించాలని కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (సీఏజీ)కి కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. ఈ ఒప్పందంలో అనేక అవకతవకలు జరిగాయని, దానిపై ఫోరెన్సిక్ ఆడిట్‌ను చేసి అందులోని నిజానిజాలను వెల్లడించాలని, ఈ కుంభకోణంలోని దోషులెవరో నిర్ధారించడానికి పార్లమెంట్‌కు సహాయపడాలని కాంగ్రెస్ నేతలు కోరారు. నెలరోజుల వ్యవధిలో రెండోసారి కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ రాజీవ్ మెహ్‌రిషిని కలిసిన కాంగ్రెస్ ప్రతినిధుల బృందం ఈ ఒప్పందానికి సంబంధించిన తాజాపత్రాలు, ఆధారాలను ఆయనకు అందజేసింది. అహ్మద్‌పటేల్, ఆనంద్ శర్మ, జైరాం రమేష్, రణదీప్ సుర్జేవాలా, ఆర్‌పిఎన్ సింగ్, వివేక్ తన్కాలతో కూడిన కాంగ్రెస్ ప్రతినిధి బృందం రాఫెల్‌లోని నిజానిజాలను వెలికితీయాలని కోరింది. రాఫెల్ ఒప్పందంపై తగిన ఆడిట్ నిర్వహించాలని కాంగ్రెస్ సెప్టెంబర్ 19న సీఏజీని, సెప్టెంబర్ 24న సీవీసీని కలిసి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఉన్న ఆధారాలు చూస్తుంటే ఇది భారతదేశంలోనే అతిపెద్ద రక్షణ కుంభకోణం అవుతుందని, రోజురోజుకు దీనిలో అనేక కొత్త నిజాలు వెలుగుచూస్తున్నా దానిపై రక్షణ శాఖ మాత్రం నోరు విప్పడం లేదని, ఏదైనా సమాధానం చెప్పినా కేవలం కుంటిసాకులు చెబుతున్నారే తప్ప ఆరోపణలకు తగిన వివరణ ఇవ్వడం లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ ఒప్పందంలో అవినీతి, స్నేహప్రీతి దాగి ఉందని, దీనిపై సమగ్ర ఆడిట్ అవసరమని వారు కోరారు. 36 జెట్ల కొనుగోలులో 41,305 కోట్ల ప్రజాధనం వృథా అవుతోందని, కచ్చితంగా ఇందులో ప్రభుత్వ అవినీతి దాగి వుందని వారు ఆరోపించారు. అంతేకాకుండా ఈ వ్యవహారంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్‌ను కాదని, 30 వేల కోట్ల విలువైన కాంట్రాక్టును స్నేహప్రీతితో ప్రైవేట్ సంస్థ అయిన రిలయన్స్ డిఫెన్స్‌కు కట్టబెడుతున్నారని విమర్శించారు. ప్రజాధనాన్ని మోదీ ప్రభుత్వం దోచుకుంటున్న విషయం మనకు పబ్లిక్‌గా కన్పిస్తోందని, ప్రజాధనం వృథా కాకుండా చూడాల్సిన బాధ్యత సీఏజీకి సైతం ఉందని, ఇందులో దాగి ఉన్న అవినీతి సీఏజీ చేసే ఆడిట్‌లో తప్పక బయటపడుతుందని, దీనిపై ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తే మరిన్ని విషయాలు వెల్లడవుతాయని కాంగ్రెస్ పేర్కొంది.
చిత్రం.. రాఫెల్ డీల్‌పై గురువారం ఢిల్లీలో క్యాగ్‌ను కలిసిన తర్వాత బయటకు వస్తున్న
కాంగ్రెస్ నేతలు అహ్మద్ పటేల్, జయరాం రమేష్ తదితరులు