జాతీయ వార్తలు

21 మంది దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బనిహాల్/జమ్ము: కిక్కిరిసిన ప్రయాణికులతో వెళుతున్న మినీ బస్సు అదుపు తప్పి జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారి నుంచి కిందికి పడిపోవడంతో 21 మంది దుర్మరణం చెందగా 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాశ్మీర్‌లోని రాంబన్ పట్టణం నుంచి బనిహాల్‌కు వెళుతున్న ఈ మినీ బస్సు శనివారం ఉదయం 9.55 గంటలకు ప్రమాదానికి గురైందని, కిక్కిరిసిన ప్రయాణికులతో ఉన్న ఈ బస్సు జాతీయ రహదారి పక్కన 200 అడుగుల లోతులో పడిపోవడంతో ప్రమాదం తీవ్రంగా ఎక్కువగా ఉందని రాంబన్ రేంజ్ డీఐజీ రఫీక్ ఉల్ హసన్ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు సహాయక చర్యలు చేపట్టారని, ఆ తర్వాత పోలీసులు, సైనికులు ప్రమాద స్థలానికి చేరుకుని గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారని పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిని హెలికాప్టర్లలో ఉధంపూర్‌లోని ఆర్మీ ఆసుపత్రికి, జమ్ములోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలించారని తెలిపారు.