జాతీయ వార్తలు

రాజస్థాన్ ర్యాలీ కోసమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను శనివారం మధ్యాహ్నం 12:30 నిమిషాలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించాల్సివున్నా, దీన్ని వాయిదా వేసి 3 గంటలకు షెడ్యూల్‌ను వెల్లడించడం వివాదానికి దారితీసింది. మీడియా సమావేశం ఆలస్యం కావడంపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని తప్పుబట్టింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుండీ ఆయా రాష్ట్రాల్లో కోడ్ అమల్లోకి వస్తుంది. ఈ పరిస్థితుల్లో ఎటువంటి పథకాలు ప్రకటించడానికి వీల్లేదు. అయితే రాజస్థాన్‌లో అజ్మీర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వసుంధర రాజె నేతృత్వంలో శనివారం ఒంటి గంటకు తలపెట్టిన భారీ బహిరంగ సభ కోసమే ఎన్నికల సంఘం విలేఖరుల సమావేశాన్ని జాప్యం చేసిందని, ఇది బీజేపీకి లబ్ది చేకూరేలా ఉందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కేవలం ప్రధాని నరేంద్ర మోదీ సభకోసం బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకు మీడియా సమావేశాన్ని 12:30 నిమిషాల నుంచి మూడు గంటలకు వాయిదా వేశారని కాంగ్రెస్ మండిపడింది. మీడియా సమావేశం వాయిదా పడటంతో రాజస్థాన్ ముఖ్యమంత్రి, ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న బీజేపీ భారీ బహిరంగ సభలో వచ్చే శాసనసభ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. కేవలం ఎన్నికల షెడ్యూల్ అమల్లోకి రావడానికి అరగంట మందు వసుంధర రాజె ఈ ప్రకటన చేయడంపై రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సచిన్ పైలట్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఐదేళ్ల కాలంలో రైతుల గురించి పట్టించుకోని వసుంధర రాజె ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేముందు ఈ ప్రకటన చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.
ర్యాలీకి-షెడ్యూల్‌కి సంబంధం లేదు
ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వాయిదాపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ఓపీ రావత్ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీ కారణంగానే ఎన్నికల షెడ్యూల్ ప్రకటనలో జాప్యం చేశారన్న ఆరోపణలకు ఆయన ఖండించారు. రాజకీయాలే ప్రధానమని, ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూడటమే వారి స్వభావమని పేర్కొన్నారు. దీనిపై తాము స్పందించాల్సిన అవసరం లేదని చెప్పారు. ఎన్నికల తేదీల ప్రకటనలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎన్నికల ఓటర్ల జాబితా ప్రచురణ అంశంలో సమస్యలు తలెత్తడమే మీడియా సమావేశం జాప్యానికి కారణమని చెప్పారు. మీడియా సమావేశం సమయం ప్రకటించిన తరువాత తెలంగాణ ఓట్ల జాబితా ప్రచురణ తేదీల్లో సమస్యలు ఉత్పన్నమవడంతో ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం సమాచారం అందించడంలో అలస్యం అయినట్టు చెప్పారు.