జాతీయ వార్తలు

ఐటీ సోదాలు కాదు.. అవి బీజేపీ దాడులే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, అక్టోబర్ 6: ఆంధ్ర, కర్నాటక రాష్ట్రాల్లో పలువురు రాజకీయ నాయకుల ఇళ్లు, వ్యాపార సంస్థలపై ఐటీశాఖ ద్వారా బీజేపీ ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా దాడులు చేయిస్తోందని కర్నాటక కార్మిక శాఖ మంత్రి వెంకట రమణప్ప ఆరోపించారు. శనివారం అనంతపురం జిల్లా నీలకంఠాపురంలో పీసీసీ అధ్యక్షుడు రఘువీరా నివాసంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటకలో రాజకీయ పార్టీలను ఎదుర్కొనే ధైర్యం లేక ప్రధాని మోదీ ఐటీశాఖ అధికారులతో ఈ దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. దీనివల్ల ఎలాంటి నష్టం లేదని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారన్నారు. కర్నాటక, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కేఎస్‌హెచ్‌ఐపీ ద్వారా చర్యలు తీసుకుంటోందన్నారు. టుంకూరు నుంచి బళ్ళారి వరకు రైల్వేలైను పనుల వేగవంతానికి అవసరమైన భూసేకరణకు చర్యలు తీసుకుంటామన్నారు. పావగడ ప్రాంతానికి తుంగభద్ర నీటిని తీసుకురావడానికి రూ.235 కోట్లు కేటాయించామని, సర్వే పనులు జరుగుతున్నాయన్నారు. మధుగిరి, పావగడ చెరువులకు సైతం హేమావతి నీటిని తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

చిత్రం..అనంతపురం జిల్లా నీలకంఠాపురంలో శనివారం విలేఖరులతో మాట్లాడుతున్న కర్నాటక మంత్రి వెంకట రమణప్ప