జాతీయ వార్తలు

ఇదేనా కాంగ్రెస్ సంస్కృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆజ్మీర్, అక్టోబర్ 6: ప్రతిపక్షాలకు అధికార దాహం తప్ప మరో ధ్యాస లేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో సమాజాన్ని చీల్చుతున్నారని ఆయన అన్నారు. మతం, కులం పేరుతో ఓటర్లను చీల్చి రాజకీయ పబ్బం గడుపుకోవడం విపక్షాలకు అలవాటైందన్నారు. శనివారం ఇక్కడ జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలన్నారు. కాంగ్రెస్‌కు ఎటువంటి పరిస్థితుల్లో ఓటు వేయవద్దని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాలతో దేశానికి హాని చేసిందన్నారు. ప్రజల సంక్షేమాన్ని మర్చి దుర్మార్గపు రాజకీయాలతో సమాజాన్ని ముక్కలు చేసేందుకు కాంగ్రెస్ వెనకాడదన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలను సమాజంతోపాటు బ్యూరోక్రసీ స్థాయికి కూడా తీసుకెళ్లిన ఘనత కాంగ్రెస్‌కు ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార దాహంతో ఉందని, విధి విధానాలు లేవని, ప్రజల సంక్షేమంపై ఆ పార్టీ నేతలకు అవగాహన లేదన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు ప్రాతిపదికన బడ్జెట్‌ను కేటాయించడం మాత్రమే కాంగ్రెస్‌కు తెలున్నారు. ప్రజలను ఎన్నికల్లో తప్పుడు హామీలతో ప్రలోభపరచడం కాంగ్రెస్‌కు అలవాటైందన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ బూటకపు హామీలతో ప్రజలను మోసం చేస్తూ నిధులను పక్కదోవబట్టించిందన్నారు. ప్రజల సమస్యలపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధిలేదనద్నారు. కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలకు నిలయమని, ప్రజా క్షేత్రం నుంచి వచ్చే కార్యకర్తలకు విలువ ఇవ్వరన్నారు. కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలకు పాల్పడే అలవాటును పెంచి పోషించిందన్నారు. అధికారం కోసం దేనికైనా దిగజారే స్వభావం ఆ పార్టీకి ఉందన్నారు. సరిహద్దుల్లో దేశం కోసం ప్రాణాలర్పిస్తున్న సైనికుల నిబద్ధతను ప్రశ్నించే స్థాయికి కాంగ్రెస్ దిగజారిందన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాదుల వెన్ను విరిస్తే, కాంగ్రెస్ పార్టీ అపహాస్యం చేసిందన్నారు. ఇటువంటి హేయమైన, నీతి బాహ్యమైన రాజకీయాలకు పాల్పడడం కాంగ్రెస్‌కు వెన్నతో పుట్టిన విద్య అన్నారు. మన సైనికులను మనమే అవమానపరచడమేనా మీ సిద్ధాంతం అని ఆయన కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో రాజస్తాన్‌ముఖ్యమంత్రి వసుంధర రాజే పాల్గొనా ను. ఆమే నెల రోజుల పాటు చేపట్టిన యాత్ర శనివారంతో ముగిసింది.