జాతీయ వార్తలు

ఎన్నికల్లో బీజేపీకి విజయం తథ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్‌గడ్, మిజోరం, తెలంగాణ రాష్ట్రాలకు జరిగే ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని బీజేపీ సీనియర్ నేత, న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్, రాజస్తాన్‌లో తమ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని ఆయన అన్నారు. ఆయన ఇక్కడ మాట్లాడుతూ కార్యకర్తలు, నేతలు సమిష్టిగా పనిచేసి పార్టీ విజయానికి పాటుపడాలన్నారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చేపట్టిన సంక్షేమ విధానాలను జనంలోకి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు.బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలైన అడ్డదార్ల తొక్కుతోందన్నారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీని ఓడించేందుకు ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు ఆదిలోనే బెడిసికొట్టాయన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం లేదన్నారు. గతంలో రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఖాయిలాపడిన రాష్ట్రాలుగా ఉండేవని, బీజేపీ హయాంలో ఈ రెండు రాష్ట్రాలుశరవేగంగా అభివృద్ధి చెందాయన్నారు. వ్యవసాయం, వౌలిక రంగాల్లో మంచి ప్రగతిని సాధించినట్లు చెప్పారు.