జాతీయ వార్తలు

ధనికులకు బీజేపీ దన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొరేనా(ఎంపీ), అక్టోబర్ 6: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహల్ గాంధీ తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడ్డారు. దేశంలో కొద్ది మంది ధనికుల ప్రయోజనాల కోసమే బీజేపీ పనిచేస్తోందని శనివారం ఇక్కడ విమర్శించారు. పేదలు, అట్టడుగు వర్గాలు, రైతుల గురించి ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదని కాంగ్రెస్ చీఫ్ విరుచుకుపడ్డారు. పేదల ఉద్ధరణ కోసమే కాంగ్రెస్ పాటుపడుతోందని ఆయన స్పష్టం చేశారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందన్న కాంగ్రెస్ అధ్యక్షుడు ‘ప్రధాని నరేంద్ర మోదీకి తెలిసే ఇదంతా జరిగింది’అని ఆరోపించారు. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే గిరిజన హక్కుల బిల్లును అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సంపన్నులకు లబ్ధి చేస్తే చేయండి, సమాజంలో పేదల బాగోగులను మాత్రం మరిచిపోవద్దు ఆయన అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక పేదలు, రైతులు ఇబ్బందుపాలయ్యారని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. ధనికులకు లక్షల కోట్ల రూపాయల మాఫీ చేసిన మోదీ సర్కార్ సన్న,చిన్నకారు రైతులవైపుకనె్నత్తి చూడలేదని ఆయన ధ్వజమెత్తారు. ఆదివాసీ ఏక్తాపరిషత్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ అధినేత మాట్లాడుతూ ‘గిరిజన బిల్లు వరం కాదు. అది గిరిపుత్రుల హక్కు. అటవీ భూములు, నీళ్లపై సర్వహక్కులూ గిరిజనులవే’అని ఆయన స్పష్టం చేశారు. యుపీఏ హయాంలో గిరిజనులు, అడవిపుత్రుల సంక్షేమం కోరి ఈ బిల్లును తీసుకొచ్చినట్టు ఆయన తెలిపారు. కాంగ్రెస్‌లోనే దళిత, గిరిజనలకు మేలు జరుగుతుందని ఆయన చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రనుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తోందని రాహుల్ ఆరోపించారు. భూ సేకరణ బిల్లు సహా పంచాయతీ రాజ్ సంస్థలను మోదీ సర్కార్ నిర్వీర్యం చేసిందని ఆయన ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వం పెద్ద వైఫల్య పథకం పెద్దనోట్ల రద్దని ఆయన తీవ్ర విమర్శ చేశారు. నల్లధనం చెలామణి చేసుకోడానికే డిమోనిటైజేషన్ తీసుకొచ్చారని ఆయన అన్నారు. ఒక్కరూ జైలుకెళ్లలేదని ఆయన తెలిపారు. విదేశీ బ్యాంకుల్లో దాచిన నల్లధనం తీసుకొస్తామన్న మోదీ హామీ ఏమైందని రాహుల్ నిలదీశారు. అలాగే ప్రజల ఖాతాల్లో 15 లక్షల జమచేస్తామన్న బీజేపీ హామీ అమలు సంగతేమిటని కాంగ్రెస్ చీఫ్ నిలదీశారు. బీజేపీ, మోదీ దృష్టి ఎంతసేపూ ధనికులవైపేనని ఆయన ధ్వజమెత్తారు. ఏదైనా ఓ కార్యక్రమం చేపడితే అది సంపన్నులకు మేలుచేకూర్చేదేనని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసేవరకూ నిద్రపోదని సభికులనుద్దేశించి ఆయన అన్నారు.‘ 2004 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. నా ప్రసంగాలు వినే ఉంటారు. ఏ నాడైనా జనం ఖాతాల్లో 15 లక్షల రూపాయల జమ చేస్తానన్న హామీ ఇచ్చానా?’అని ప్రశ్నించారు. కర్నాటక ఎన్నికల ప్రచారంలో రైతులకు రుణమాఫీ కల్పిస్తామని హామీ ఇచ్చామని, అధికారంలోకి రాగానే అమలుకు శ్రీకారం చుట్టామని కాంగ్రెస్ అధ్యక్షుడు స్పష్టం చేశారు.

చిత్రం..మధ్యప్రదేశ్‌లోని మొరేనాలో గిరిజన సదస్సులో మాట్లాడుతున్న రాహుల్‌గాంధీ