జాతీయ వార్తలు

యువత నిర్వీర్యానికి పాక్ కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: భారతీయ యువతను నిర్వీర్యం చేసేందుకు పాకిస్తాన్ కుయుక్తులను పన్నుతోందని, మాదకద్రవ్యాల అక్రమరవాణాకు పాల్పడుతోందని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అన్నారు. దీని వల్ల ఆర్మీలో చేరే వారి సంఖ్య తగ్గిపోతుందన్నారు. హిందూస్తాన్ టైమ్స్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పంజాబ్‌లోకి మాదకద్రవ్యాల అక్రమ రవాణా విపరీతంగా పెరిగిందన్నారు. సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నామన్నారు. సరిహద్దుల వెంట యువతను పాడు చేసేందుకు పాక్ దుష్టపన్నాగంతో ఉందన్నారు. ఇటీవల సరిహద్దు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు పట్టుబడిన ఘటనలను వివరించారు.
కర్నాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి మాట్లాడుతూ కర్నాటకలోసంకీర్ణ ప్రభుత్వానికి వచ్చే ఢోకా ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ నుంచి గట్టి మద్దతు తనకు ఉందన్నారు. త్వరలో ప్రభుత్వం కూలిపోతుందని వస్తున్న వదంతుల్లో నిజం లేదన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ తనతో ఉందన్నారు. మంత్రివర్గ విస్తరణ పెద్ద అంశమేమీ కాదన్నారు. కర్నాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఐదేళ్లు ఉంటుందన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ మాట్లాడుతూ కొరిగాన్ భీమా ఘటన కుట్రపూరితమైందన్నారు. రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలను అనుమతించే ప్రసక్తిలేదన్నారు. కులం, మతం, వర్గంకు అతీతంగా రాజ్యాంగ బద్ధంగా నడుచుకోవడం తన ధర్మమన్నారు. రాజధర్మాన్ని పాటిస్తానన్నారు. తీవ్రవాదులు దేశంలో అస్థిరత్వం కల్పించేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. కొరిగాన్ భీమా ఘటన వెనక అర్బన్ నక్సల్స్ ఉన్నరన్నారు. జీఎస్‌టీ పరిధిలోకి చమురు తీసుకురావాలన్న డిమాండ్‌కు తన మద్దతు ఉందన్నారు.