జాతీయ వార్తలు

వీసీల నియామకంలో భారీ కుంభకోణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, అక్టోబర్ 6: తమిళనాడులో వివిధ విశ్వవిద్యాలయాలకు వైస్‌చాన్సలర్లనియామకంపై కోట్లాది రూపాయలు చేతులు మారాయని గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ అన్నారు. తాను గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించకముందు ఈ అవకతవకలు జరిగాయన్నారు. గవర్నర్ వ్యాఖ్యలపై ఎఐఎడిఎంకె ప్రభుత్వం స్పందించింది. వీసీల నియమాకంలో ప్రభుత్వం పాత్ర ఉండదని పేర్కొంది. శనివారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్ పురోహిత్ మాట్లాడుతూ, ఈ ఆరోపణలను తాను మొదట నమ్మలేదన్నారు. వ్యవస్థలో మంచి మార్పులు రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. తాను ఇంతవరకు తొమ్మిది మంది వీసీలను పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన నియమించినట్లు చెప్పారు. ఈ నియామకాలపై ఇంతవరకు ఒక్క ఆరోపణ కూడా రాలేదన్నారు. వీసీ దాకా నియామకాల విషయంలో పారదర్శకత ఉండాలన్నారు.