జాతీయ వార్తలు

స్విచాఫ్ చేయంచింది పోలీసులే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, అక్టోబర్ 6: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జే జయలలిత మృతికి సంబంధించి విచారణ నిమిత్తం నియమించిన కమిటీకి అపోలో ఆసుపత్రి నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో తమ ఆసుపత్రి ఆవరణలో ముఖ్యమంత్రి జయలలిత కదలికలకు సంబంధించిన సమయంలో సీసీటీవీ కెమెరాలను స్విచాఫ్ చేయాలని పోలీసులు ఆదేశించారని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్గదర్శకాల మేరకు ఐసీయూ, సీసీయూ వార్డుల్లో సీసీటీవీ కెమెరాలు ఉండవని అపోలో ఆసుపత్రి మేనేజర్ ఎస్‌ఎం మోహన్ కుమార్ చెప్పారు. ఈ వివరాలను జస్టిస్ ఏ ఆర్ముగస్వామి కమిషన్‌కు ఆయన తెలియచేశారు. రూం నుంచి డయాగ్నస్టిక్ పరీక్షల నిమిత్తం బయటకు తీసుకెళ్లే సమయంలో కారిడార్లు, ఇతర చోట్ల సీసీటీవీ కెమెరాలను స్విచాఫ్ చేయలని పోలీసులు ఆదేశించారని అపోలో ఆసుపత్రి పేర్కొంది. పోలీసు ఐజీ నిఘా విభాగం అధికారి కేఎన్ సత్యమూర్తి ఆదేశం మేరకు సీసీటీవీ కెమెరాలను స్విచాఫ్ చేశామన్నారు. డయాగ్నస్టిక్ రూం నుంచి మళ్లీ ఐసీయూ వార్డుకు జయలలితను తీసుకొచ్చిన తర్వాత సీసీటీవీ కెమెరాలను స్విచాన్ చేసేవారమన్నారు. జయలలిత ఆరోగ్యానికి సంబంధించిన బులిటెన్‌లను ముందుగా రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఆరోగ్య శాఖ కార్యదర్శికి పంపించేవారమన్నారు. కాగా ఇప్పటికే అప్పటి గవర్నర్ కార్యదర్శి రమేష్‌చంద్ మీనా, అపోలో ఆసుపత్రి ప్రతినిధి సుబ్బయ్య విశ్వనాథన్ కమిషన్ ఎదుట హాజరై తమకు తెలిసిన సమాచారాన్ని విచారణ కమిషన్‌కు ఇచ్చారు.