జాతీయ వార్తలు

న్యాయవాదుల సమ్మెపై నిషేధాన్ని ఎత్తివేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: న్యాయవాదులు సమ్మె చేయరాదని 16 ఏళ్ల క్రితం విధించిన నిషేధాన్ని ఎత్తివేసేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ అన్నారు. న్యాయవాదుల సమ్మెపై నిషేధం ఎందుకు ఎత్తి వేయాలని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శనివారం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వాహకులు కొత్తగా ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ రంజన్ గొగోయ్‌ను సత్కరించాయి. ఈ సందర్భంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా పై విషయాన్ని ప్రస్తావించారు. దీనికి స్పందించిన జస్టిస్ రంజన్ గొగోయ్ మాట్లాడుతూ న్యాయవాదుల సమ్మె వల్ల కోర్టులు పనిచేయవని, దీని వల్ల ప్రజల హక్కులకు భంగం కలిగించినట్లవుతుందన్నారు. ఇదేమీ పెద్ద అంశం కానేకాదన్నారు. న్యాయపరమైన చర్చలు ఈ అంశంపై అనవసరమని, పైగా న్యాయవాదులు ఎందుకు సమ్మె చేయాలని ఆయన ప్రశ్నించారు. ఈ అభిప్రాయాన్ని సమర్థిస్తున్నట్లు వేదికపైన ఉన్న జస్టిస్ అరుణ్ మిశ్రా తెలిపారు. ప్రజాస్వామ్యం మనుగడకు ప్రమాదం వాటిల్లినప్పుడు, న్యాయ వ్యవస్థను రక్షించాలనుకునే సమయంలో మాత్రమే న్యాయవాదులకు సమ్మె అవసరమవుతుందన్నారు. అంతేకాని న్యాయవాదులకు సమ్మె చేసే హక్కు ఉండదన్నారు. అటవిక రాజ్యాన్ని భరించగలమా ? రూల్ ఆఫ్ లా కోసం సామాన్యుడు తలుపుతడితే ఏమి చెప్పాలి ? కోర్టులో మీరు లేకపోతే ప్రజల హక్కులకు భంగం వాటిల్లితే ఎవరు పరిరక్షిస్తారు అని జస్టిస్ మిశ్రా అన్నారు. అనంతరం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ న్యాయవాదుల నోటికి తాళం వేస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతింటుందన్నారు. సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి అంటే తమకు ఎనలేని గౌరవం ఉందని, తమ హక్కులను పరిరక్షిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. అంతకు ముందు జస్టిస్ రంజన్ గొగోయ్ మాట్లాడుతూ దేశంలోని జైళ్లలో పెద్ద సంఖ్యలో విచారణ ఖైదీలు ఉన్నారని, వీరిలో 47 శాతం మంది వయస్సు 18 నుంచి 30 ఏళ్లని చెప్పారు. ఇందులో 66 నుంచి 67 శాతం మంది ఎస్సీ, ఎస్టీలని చెప్పారు. న్యాయ వ్యవస్థలో ప్రమాణాలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికాలో ప్రతి వెయ్యి మంది జనాభాలో 300 మంది కేసులుదాఖలు చేస్తారని, అదే భారత్‌లో 15 కేసులుదాఖలు చేస్తారని చెప్పారు. అదే 150 మంది కేసులు దాఖలు చేస్తే మన పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
ప్రతి 1400 మందికి ఒక న్యాయవాది ఉన్నారన్నారు. పెద్ద సంఖ్యలో మనకు న్యాయవాదులు అవసరమన్నారు. న్యాయ విద్యలో ప్రమాణాలు పెంచాలన్నారు. దేశంలో 23 జాతీయ న్యాయ కళాశాలలు, 1500 సాధారణ న్యాయ కళాశాలలు ఉన్నాయన్నారు. దేశంలో న్యాయ కళాశాలల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. జస్టిస్ ఎన్‌వి రమణ, జస్టిస్ మోహన్ ఎం శాంతనగౌడర్ కూడా మాట్లాడారు.