జాతీయ వార్తలు

రాహుల్ బాబాను నమ్మకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాబువా(మధ్యప్రదేశ్), అక్టోబర్ 6: గిరిజనులు,దళితుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని, ఊకదంపుడు ఉపన్యాసాలతో ఈ వర్గాలను మోసం చేసిందని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ధ్వజమెత్తారు. గిరిపుత్రుల సంక్షేమం కోసం బీజేపీ కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. శనివారం ఇక్కడ జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాలనలో రాష్ట్రంలో గిరిజనుల సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా అమలవుతున్నాయన్నారు. ఈ రోజు గిరిపుత్రులు మోటార్ సైకిళ్లను కొనుక్కుని తమ విధులను నిర్వహించుకుంటున్నారన్నారు. రాహుల్ బాబా చెప్పే కబుర్లు నమ్మరాదన్నారు.కులం, మతం, వర్గం, ప్రాంతం పేరుతో రెచ్చగొట్టడం తప్ప కాంగ్రెస్ పార్టీకి మరేమి తెలియదన్నారు. కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్‌ను 55 ఏళ్ల పాటు పాలించిందని కాని అభివృద్ధిని మర్చిపోయిందన్నారు. ఈ ర్యాలీకి వచ్చిన వాళ్లలో చాలా మంది మోటార్ సైకిళ్లపై వచ్చారన్నారు. రాష్ట్రంలో సంపద రావడానికి సీఎం చౌహాన్ అవలంభించిన అభివృద్ధి సంక్షేమ విధానాలే కారణమన్నారు. వాజపేయి ప్రధానిగా బాధ్యతలు చేపట్టే వరకు జాతీయ స్థాయిలో గిరిజన సంక్షేమ శాఖకు మంత్రి కూడా లేరన్నారు. 2014లో బీజేపీ రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి రావడానికి గిరిజనులు, దళిత వర్గాలు పెద్ద ఎత్తున ఓటు వేశారన్నారు. పేదల కోసమే బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గిరిజన సంక్షేమానికి ఏ మాత్రం నిధులు కేటాయించారని ఆయన ప్రశ్నించారు. బీజేపీ పాలన రాష్ట్రాల్లో గిరిజన సంక్షేమ శాఖకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామన్నారు.