జాతీయ వార్తలు

మోదీని గద్దెదింపుదాం..రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, అక్టోబర్ 6: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అస్తవవ్యస్త విధానల వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలైందని తృణమూల్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. ఆర్థిక స్థిరత్వం లేకపోతే దేశాభివృద్ధి సాధ్యం కాదన్న మమత‘మోదీ ప్రభుత్వంలో మొత్తం వ్యవస్థ ధ్వంసమైంది’అని ధ్వజమెత్తారు. ‘ఆర్‌ఎస్‌ఎస్ పెత్తనం పెరిగిపోయింది. రాజకీయ పార్టీని మించిపోయి వారి వ్యవహారం నడుపుతున్నారు’అని ఆమె తీవ్రంగా మండిపడ్డారు.‘ మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడింది. ఈ పరిస్థితులను చక్కదిద్ది దేశాన్ని కాపాడుకోవాలి. ఆర్థిక స్థిరత్వం లేకపోతే రాజకీయ అశాంతి నెలకొంటుంది’అని మమతాబెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ పెట్రో ఉత్పత్తి ధరలు పెంచేసి ప్రజలను నానా అగచాట్లకు గురిచేశారని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ సర్కార్‌ను సాగనంపాలని ఆమె పిలుపునిచ్చారు. కేంద్ర అప్రజాస్వామ్య పాలనకు వ్యతిరేకంగా వచ్చే జనవరి 19న కోల్‌కతాలో ‘ఫెడరల్ ఫ్రంట్ ర్యాలీ’ని నిర్వహించనున్నట్టు తృణమూల్ అధినేత్రి వెల్లడించారు. భావసారుప్యత గల పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులందరినీ ర్యాలీకి ఆహ్వానించనున్నామని ఆమె తెలిపారు. ఇప్పటికే అనేక మంది నాయకులు ర్యాలీకి హాజరవుతామని హామీ ఇచ్చారని ఆమె వెల్లడించారు. దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలను ఆహ్వానిస్తున్నామని, సీపీఎం, ఆర్‌ఎస్‌పీ, ఫార్వర్డ్ బ్లాక్ నేతలను పిలుస్తామని తృణమూల్ అధినేత్రి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని గద్దెదించడమే తమ ధ్యేయమని ఆమె చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి ఒక్క సీటు రాకూడదన్నదే తమ లక్ష్యమని, ఆ దిశగానే తృణమూల్ కాంగ్రెస్ పనిచేస్తోందని మమత ప్రకటించారు. తృణమూల్ సీనియర్ నేత పార్థ చటర్జీకి ఆర్‌ఎస్‌ఎస్ లీగల్ నోటీసు ఇవ్వడంపై ముఖ్యమంత్రి తీవ్రంగానే స్పందించారు. ఇలాంటి నోటీసులకు తృణమూల్ కాంగ్రెస్ భయపడదని ఆమె అన్నారు. తమ సంస్థ రాజకీయ పార్టీఅని ఆర్‌ఎస్‌ఎస్ ప్రకటించుకుని అప్పుడు ఇలాండి బెదిరింపులకు దిగాలని ఆమె సలహా ఇచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్ ముసుగు తీయాలన్న మమత ‘ఆర్‌ఎస్‌ఎస్ ఓ సామాజిక సంస్థగానే నేను ఇప్పటికీ భావిస్తున్నా. అయితే సంఘీయుల తీరు రాజకీయ పార్టీలను తలదనే్నదిగా ఉంది’అని వ్యాఖ్యానించారు. సీబీఐ, ఈడీకి తాము భయపడబోమని, అవి కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలని ఆమె ఆరోపించారు.