జాతీయ వార్తలు

అలరించిన ముషాయిరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: జాతిపిత మహాత్మా గాంధీ బోధనలు, అనుసరించిన విలువలను చాటిచెప్పే రీతిలో కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ శనివారం ఇక్కడ ఒక ముషాయిరాను నిర్వహించింది. గాంధీజీ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఇక్కడి డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. వసీం బారెల్వీ, హసీబ్ సోజ్, ఐజాజ్ పాపులర్ మరేథి, సురేంద్ర సింగ్ షాజర్ వంటి ఉర్దూ కవులు ఈ ముషాయిరాలో పాల్గొన్నారు. గాంధీజీ సందేశాలయిన శాంతి, మానవత్వం, సమైక్యతలను వారు తమ కవితల ద్వారా వినిపించి ప్రేక్షకులను అలరించారు. ‘ఈ కార్యక్రమాలు ఒకవైపు గాంధీజీ బోధనలు, విలువలను వ్యాపింపజేస్తూ, మరోవైపు సమాజంలో సామరస్యాన్ని, సౌభ్రాతృత్వాన్ని బలోపేతం చేస్తాయి’ అని ఈ ముషాయిరాను ప్రారంభించిన కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ పేర్కొన్నారు. రాజకీయ, కళారంగాలకు చెందిన ఎందరో ప్రముఖులు ఈ ముషాయిరాకు హాజరయి, కవితలను ఆలకించారు.