జాతీయ వార్తలు

కేరళలో తీవ్రమవుతున్న శబరిమల వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, అక్టోబర్ 6: శబరిమల ఆలయంలో అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో కేరళ రాజకీయాలు వేడెక్కాయి. ప్రజల మనోభావాలు, అభిప్రాయాలకు అనుగుణంగా ప్రభుత్వం నడుచుకోవాలంటూ రాష్ట్రంలో అనేక చోట్ల ఉద్యమం ఊపందుకుంటోంది.
సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసేదిలేదంటూ సీపీఎం ప్రభుత్వం ప్రకటించగా, రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. దీంతో సున్నితమైన ఈ అంశంపై ప్రజల్లోకి వెళ్లాలని అధికార, విపక్ష పార్టీలు నిర్ణయించాయి. కొట్టాయం, మల్లాపురం జిల్లాల్లో పెద్ద సంఖ్యలో మహిళలు కోర్టు తీర్పును వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. కోర్టు తీర్పును అమలు చేయాలని నిర్ణయించినట్లు ఇప్పటికే సీపీఎం ప్రభుత్వం పేర్కొంది. కాగా అరున్మలా పట్టణంలో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో జరుగుతున్న ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.
ఈ ఘర్షణలో పోలీసుల దౌర్జన్యం వల్ల పది మంది గాయపడ్డారు. కొట్టాయంలో శబరిమల ప్రధాన పూజారి కే రాజీవరు మాట్లాడుతూ సంప్రదాయాలు, సంస్కృతులను పరిరక్షించేందుకు అన్ని వర్గాల ప్రజలు ఉమ్మడిగా ఉద్యమించాలన్నారు. శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి భక్తులు మనోభావాలను గౌరవించాలన్నారు. ట్రావెన్‌కోర్ దేవాలయం బోర్డు వద్ద స్వామి అయ్యప్ప భక్తులు ధర్నా చేశారు. కాగా రాష్ట్ర మంత్రి కే సురేంద్రన్ మాట్లాడుతూ ఈ విషయమై మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సున్నితమైన ఈ అంశాన్ని రాజకీయం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయని ఆయన చెప్పారు. పరస్పర సహకారంతో సమస్యపై చర్చిస్తామన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కే బాలకృష్ణన్ మాట్లాడుతూ, అన్ని వర్గాలతో మాట్లాడి వారి అభిప్రాయాల మేరకు సముచిత నిర్ణయం తీసుకుంటామన్నారు. తమకు ఈ అంశంపై స్పష్టత ఉందన్నారు.
కేపీసీసీ అధ్యక్షుడు ముళ్లప్పల్లి రామచంద్రన్ మాట్లాడుతూ, అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. బీజేపీ ఆరెస్సెస్‌కు నిజంగా ఈ అంశంపై చిత్తశుద్ధి ఉంటే, పార్లమెంటులో శాసనం తేవాలని ఆయన కోరారు. కాగా ఈ ఆలయ ధర్మకర్తలు వచ్చే సోమవారం ముఖ్యమంత్రి విజయన్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్ అడిగారు.