జాతీయ వార్తలు

ఆంక్షలు ఉండకపోవచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: రష్యా నుంచి ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థ కొనుగోలుకు భారత్ ఎలాంటి పరిస్థితుల్లో ఒప్పందాన్ని కుదుర్చుకుందో అమెరికా అర్థం చేసుకుందని, అందువల్ల ఆ దేశం భారత్‌పై ఆంక్షలు విధించకపోవచ్చని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నందున భారత్‌కు అమెరికా నుంచి ఆంక్షల ముప్పు పొంచి ఉన్న తరుణంలో నిపుణులు ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్, రష్యా మధ్య కుదిరిన అయిదు బిలియన్ డాలర్ల విలువ గల ఈ ఒప్పందం భారత్-అమెరికా మధ్య బంధానికి పరీక్షగా నిలువబోతోందని వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు కమాండోర్ (రిటైర్డ్) సి.ఉదయ్ భాస్కర్ పేర్కొన్నారు. రష్యా, ఇరాన్, ఉత్తర కొరియాలను అణచివేయడానికి ఆ దేశాలతో మరే దేశమయినా రక్షణ, వ్యూహాత్మక అంశాలకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకుంటే ఆ దేశాలను శిక్షించే చర్యలో భాగంగా ఆంక్షలు విధించేందుకు అమెరికా చట్టం కాట్సా (సీఏఏటీఎస్‌ఏ- కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రో సాంక్షన్స్ యాక్ట్) అనుమతిస్తోంది. భారత్-అమెరికా మధ్య ఇటీవల ఢిల్లీలో జరిగిన ‘2ప్లస్2’ చర్చల్లో భారత ప్రభుత్వం.. రష్యాతో భారత్‌కు 1960ల నాటి నుంచి కొనసాగుతూ వస్తున్న లోతయిన రక్షణ సంబంధాల గురించి అమెరికాకు వివరించింది. అందువల్ల భారత్ పరిస్థితిపై అమెరికాకు నిర్దిష్టమయిన అవగాహన ఉందని నేను భావిస్తున్నాను’ అని ఉదయ్ పేర్కొన్నారు.