జాతీయ వార్తలు

పాక్‌కు బ్రహ్మోస్ రహస్యాలు లీక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగ్‌పూర్, అక్టోబర్ 8: భారత రక్షణ పాటవంలో అత్యంత కీలక భూమిక పోషిస్తున్న బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించిన కీలక సాంకేతిక సమాచారాన్ని పాకిస్తాన్‌కు లీక్ చేస్తున్న ఏరోస్పేస్ ఇంజనీర్ నిశాంత్ అగర్వాల్‌ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. భారత రక్షణ పరిశోధనా సంస్థ డిఆర్‌డిఓ, రష్యాకు చెందిన సైనిక పారిశ్రామిక కన్సార్టియం సంయుక్తంగా ఏర్పాటు చేసిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ కేంద్రంలో ఇంటనీర్‌గా పనిచేస్తున్న అగర్వాల్‌పై నిఘా పెట్టిన అధికారులు గూఢచర్య వ్యవహారం బయట పడటంతో అదుపులోకి తీసుకున్నారు. భారత ప్రత్యర్థి దేశమైన పాకిస్తాన్‌కు బ్రహ్మోస్ సాంకేతిక వివరాలను ఇతడు అందిస్తున్నట్టుగా సమాచారం అందిందని అధికారులు తెలిపారు. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందాలు సంయుక్త ఆపరేషన్‌లో అగర్వాల్ గూఢచర్య వ్యవహారం బట్టబయలైందని, అందుకే అతడ్ని అరెస్టు చేయడం జరిగిందని వివరించారు. అగర్వాల్ గత ఏడాదిగా
వార్దారోడ్డులోని తన ఇంట్లోనే అద్దెకు ఉంటున్నాడని దాని యజమాని మనోహర్ కాలే తెలిపారు. సోమవారం తెల్లవారు జామున ఐదున్నరకు వచ్చిన అధికారులు సాయంత్రం ఐదున్నర వరకూ ఉన్నారని ఆయన చెప్పారు. రూర్కీకి చెందిన అగర్వాల్‌కు రెండు నెలల క్రితమే పెళ్లయిందని, భార్యతోనే తన ఉంటున్నాడన్నారు. ఆధార్ కార్డుతో పాటు తన యజమాని నుంచి సర్ట్ఫికేట్ కూడా చూపించి తన ఇంట్లో అద్దెకు దిగాడని కాలే వివరించారు. భారత్-రష్యా ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఇక్కడికి సమీపంలో 1998 ఫిబ్రవరి 12న బ్రహ్మోస్ ఏరోస్పేస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. భారత్‌లోని బ్రహ్మపుత్ర, రష్యాలోని మోస్క్‌వా నదుల పేర్లు కలిసేలా ఈ ప్రాజెక్టుకు బ్రహ్మోస్ అని నామకరణం చేశారు.

చిత్రం..గూఢచర్యం కేసులో అరెస్టయన నిశాంత్ అగర్వాల్