జాతీయ వార్తలు

బీజేపీలోకి పరిపూర్ణానంద?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి బీజేపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు కనిపిస్తున్నది. ఈ క్రమంలో ఆయన సోమవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌తో సమావేశమయ్యారు. అనంతరం పరిపూర్ణానంద విలేఖరులతో మాట్లాడుతూ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశాల మేరకు తన ప్రచారం ఉంటుందని చెప్పారు. తన భవిష్యత్ కార్యాచరణ గురించి పూర్తి వివరాలను అమిత్ షా అడిగిన తెలుసుకున్నారని వెల్లడించారు. బీజేపీ హైకమాండ్ ఆలోచనలు, నిర్ణయాలు, అభిప్రాయాల ప్రకారం నడుచుకుంటానని వెల్లడించారు. నవరాత్రులు పూర్తయిన తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన వెల్లడించారు.
హిందూ సెంటిమెంట్‌ను వచ్చే ఎన్నికల్లో స్వామి పరిపూర్ణనంద ద్వారా తమకు అనుకులంగా మలుచుకునే పనిలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆయన ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
నవరాత్రి ఉపవాస దీక్ష ముగిసిన తర్వాత మరోసారి అమిత్ షాతో పరిపూర్ణనంద సమావేశం కానున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ప్రచారం చేయాలా లేక రెండు రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేసేందుకు బాధ్యతలు అప్పగించాలా అన్న అంశంపై బీజేపీ పెద్దలతో స్వామి సోమవారం చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.