జాతీయ వార్తలు

రాహుల్ గాంధీ నాపై పోటీ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉన్నావ్ (యూపీ), అక్టోబర్ 8: రానున్న 2019 లోక్‌సభ ఎన్నికల్లో తనతో పోటీ చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంథీకి మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ పార్లమెంటు సభ్యుడు సాక్షి మహారాజ్ సవాల్ విసిరారు. ఆ ఎన్నికల్లో రాహుల్ తనను ఓడిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని ఆయన స్పష్టం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఉన్నావ్ లోక్‌సభ స్థానం నుంచి రాహుల్ గాంధీతో పోటీకి తలపడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఒకవేళ తాను ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, అలాగే రాహుల్ కూడా ఓడిపోతే ఆయన ఈ దేశానే్న వదిలి ఇటలీకి వెళ్లిపోవాలని సాక్షి మహారాజ్ షరతు విధించారు. ఆయనలో స్వచ్ఛత లేనపుడు ఈ గత సెప్టెంబర్ మాసంలో ఆయన మానస సరోవర్ యాత్రకు ఎందుకు వెళ్లారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఆయన యాత్రను తాము తప్పుపట్టడం లేదని, ఐతే మాంసాహారం వంటి వాటికి అలవాటుపడిన వ్యక్తులు ఇలాంటి పవిత్ర యాత్రలు చేయకూడదని శాస్త్రాలు సైతం చెబుతున్నాయని ఆయన పేర్కొన్నారు.