జాతీయ వార్తలు

పిల్లలపై లైంగిక వేధింపుల కేసుకు వయసు నిబంధన వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 8: చిన్నపిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించి కేసు నమోదుకు ఇప్పుడు ఉన్న వయోపరిమితి నిబంధనను ఎత్తివేయాలని కేంద్ర న్యాయశాఖ మంత్రికి కేంద్ర స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ విజ్ఞప్తి చేశారు. సమాజంలో హింస, చిన్నపిల్లలు, మహిళలపై అకృత్యాలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇవి ఎన్నటికీ పూర్తిగా నిర్మూలించలేమని అన్నారు. లైంగికంగా వేధింపులకు గురైన వారు ఇప్పుడు తమ బాధను చెప్పుకోవడానికి భారత్‌లో ప్రవేశపెట్టిన ‘మీ టూ’ ఉద్యమానికి ఆమె తన మద్దతు తెలిపారు. ఇలాంటి ఉద్యమం ప్రవేశపెట్టడం పట్ల ఆమె సంతోషాన్ని వ్యక్తం చేస్తూ బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి తమ బాధను చెప్పుకోగలుగుతున్నారని అన్నారు. బాధితులు తమకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేయడానికి ఎలాంటి కాలపరిమితి విధించరాదని ఆమె న్యాయశాఖ మంత్రికి రాసిన లేఖలో కోరారు. సెక్షన్ 468 ప్రకారం బాధితులు తమపై జరిగిన అఘాయిత్యం, వేధింపులపై సంఘటన జరిగిన మూడేళ్లలోపు ఫిర్యాదు చేయాల్సి ఉంది. అలాగే సెక్షన్ 473 ప్రకారం కేసు విచారణకు అనర్హమైనదని, మూడేళ్ల కంటే ఆలస్యంగా ఫిర్యాదు చేయడానికి సహేతుకమైన కారణం ఉందని భావిస్తే జడ్జి కేసును స్వీకరించవచ్చు. పిల్లలపై జరిగిన హింసకు సంబంధించి కేసులపై ఫిర్యాదు చేయడానికి బాధితులు 10-15 సంవత్సరాల మధ్య వయసువారై ఉండాలి. అయితే 18 ఆపై వయసు ఉన్న వారు ఫిర్యాదు చేస్తే చిన్నపిల్లలపై అత్యాచార కేసు కింద వారి నుంచి ఫిర్యాదు స్వీకరించడం లేదు. 10-15 సంవత్సరాల తర్వాతి వారు ఫిర్యాదు చేసినా వయసుతో సంబంధం లేకుండా ఫిర్యాదు తీసుకోవాలని మేనకాగాంధీ ఈ సందర్భంగా న్యాయశాఖ మంత్రిని కోరారు. ఇలావుండగా పిల్లలపై లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి వారు 30 ఏళ్ల వయసు వచ్చేవరకు వారి ఫిర్యాదులను స్వీకరించాలని మేనకాగాంధీ ఇటీవల జరిగిన సమావేశంలో సూచించారు. తనపై పది సంవత్సరాల క్రితం జరిగిన లైంగిక వేధింపులపై సినీనటి తనుశ్రీ మీటూ లో ప్రస్తావించడాన్ని మేనకాగాంధీ ప్రశంసించారు.