జాతీయ వార్తలు

మరుగుదొడ్డికోసం మంగళసూత్రం తాకట్టు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ససరాం (బిహార్), జూలై 18: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన స్వచ్ఛ్భారత్ గ్రామీణులను ఎంత ప్రభావితం చేస్తుందో తెలియజేసే ఘటన బిహార్‌లో జరిగింది. రొహ్‌తాస్ జిల్లాకు చెందిన ఓ మహిళ మంగళసూత్రాన్ని తాకట్టుపెట్టి ఇంట్లో టాయిలెట్ నిర్మాణానికి నడుంబిగించింది. బరాఖన్నా గ్రామంలో చోటుచేసుకున్న ఈ సంఘటన జిల్లా యంత్రాంగం దృష్టికి రావడంతో పారిశుద్ధ్య కార్యక్రమానికి ఆమెను బ్రాండ్ అంబాసిడర్ (ప్రచారకర్త)గా ప్రకటించింది. ఫూల్ కుమారి అనే ఆమె ఓ ప్రాథమిక పాఠశాలలో వంట మనిషిగా పనిచేస్తోంది. ఆమె భర్త వ్యవసాయ కూలీ. వచ్చే డబ్బులతో రోజు గడవడమే కష్టం కావడంతో మరుగుదొడ్డి నిర్మించుకోవడం అన్నది గగనమైపోయింది. మంగళ సూత్రం తాకట్టుపెట్టి వచ్చిన డబ్బులతో టాయిలెట్ కట్టుకోవాలని నిర్ణయించుకుంది. ఫూల్ కుమారి వెంటనే అనుకున్నది సాధించింది. మంగళసూత్రం తాకట్టుద్వారా వచ్చిన సొమ్ములతో ఓ మంచి కార్యక్రమానికి పూనుకున్నట్టు రొహతాస్ జిల్లా మెజిస్ట్రేట్ అనిమేశ్ కుమార్ పరషార్ వెల్లడించారు. ‘రెండురోజుల్లో నేనూ, అధికారులతో కలిసి ఫూల్‌కుమారి ఊరెళ్లి టాయిలెట్ నిర్మాణం పనులను ప్రారంభిస్తాను. కుమారి భర్త, మామగారు సమక్షంలోనే ఇది జరుగుతుంది’ అని ఆయన స్పష్టం చేశారు. శానిటేషన్ పనులకు ఆమెను బ్రాండ్ అంబాసిడర్‌గా వాడుకుంటామని కూడా ఆయన వెల్లడించారు. పది రోజుల్లో టాయిలెట్ నిర్మాణం పూర్తవుతుందని పరషార్ చెప్పారు.