జాతీయ వార్తలు

మోదీ ప్రభుత్వ విధానాలపై ఉద్యమించిన ఐక్య యువజన ఫ్రంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 8: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలపై 14 జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీల ఐక్య యువజన ఫ్రంట్ సోమవారం ఢిల్లీలో నిరసన ప్రదర్శన నిర్వహించింది. నిరుద్యోగం,ద్రవ్యోల్బణం, పెట్రోధరలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పార్లమెంటు వరకు పెద్దయెత్తున ర్యాలీ జరిగింది. కాంగ్రెస్ నేతృత్వంలో బీజేపీ వ్యతిరేక పార్టీలకు చెందిన వివిధ యువజన విభాగాలతో గత నెలలో ఈ ఐక్య యువజన ఫ్రంట్ ఏర్పాటైంది. కాగా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పెట్రోలు ధరల పెంపు వంటి సమస్యలతోబాటు, ఎస్సెస్సీ, ఇతర కాంపెటీటివ్ ఎగ్జామినేషన్ల నిర్వహణలో అవకతవకలకు పాల్పడటం, పోలీసు వేధింపుల వంటి చర్యలతో కేంద్ర ప్రభుత్వం యువత భవితవ్యాన్ని అగమ్యగోచరంగా మార్చిందని, రాఫెల్ డీల్ అతిపెద్ద కుంభకోణమని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా ఈ సందర్భంగా మాట్లాడుతూ పేర్కొన్నారు. దేశ్ బజావో, యువా బజావో వంటి నినాదాలు ఈ సందర్భంగా మార్మోగాయి. కాగా ప్రతి 12 నిమిషాలకు ఒక దళితుడు ఈ దేశంలో వేధింపులకు గురవుతున్నాడని యువజనతాదళ్ (సెక్యులర్) కార్యనిర్వాహక అధ్యక్షుడు చంద్రశేఖర్ పేర్కొన్నారు.