జాతీయ వార్తలు

మంత్రి చిత్రాలతో కూడిన బ్యాగులు పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డామన్ (మధ్యప్రదేశ్) అక్టోబర్ 8: మధ్యప్రదేశ్ రాష్ట్రం డామన్ జిల్లాలో ఎన్నికల నియమావళి ఉల్లఘనపై అధికారులు కొరడా ఝళిపించారు. ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి జయంత్ మాలయ్యా చిత్రాలు ముంద్రించిన రెండు వేల సంచులను అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కమిషన్ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన నేపథ్యంలో గత శనివారం నుంచి మధ్యప్రదేశ్‌లో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 28న పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 11న ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఈ క్రమంలో అందిన ఫిర్యాదునకు స్పందించిన పోలీసులు, జిల్లా అధికారులతో కూడిన బృందం దాడులు చేసి ఆర్థిక మంత్రి బొమ్మ ముద్రించిన రెండు వేల సంచులను స్వాధీనం చేసుకుంది. ఈ సంచుల నిండా పారిశుద్ధ్యానికి వినియోగించే ప్యాడ్లు, సబ్బులు, ఇతర వస్తువులు ఉన్నాయని సబ్‌డివిజినల్ మేజిస్ట్రేట్ రవీంద్ర చౌక్సే తెలిపారు. స్వయం సహాయక గ్రూపులకు శిక్షణనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని గ్రామీణ నిత్యావసరాల మిషన్‌కు సరఫరాచేసే ఓ కేంద్రం కోసం ఈ సంచులను రూపొందించడం జరిగిందని ఆయన చెప్పారు, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ సంచులను స్వాధీనం చేసుకుని స్వయం సహాయక సంఘాల మేనేజర్ అఖిలేష్ శుక్లా, డ్రైవర్ లాల్‌చంద్ అహిర్వార్‌పై కేసులు నమోదు చేశామని, వీరిద్దరి నుంచి ఆరేసి వందల సంచులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.