జాతీయ వార్తలు

ఈసారి సోషల్ మీడియా ‘యుద్ధం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, అక్టోబర్ 8: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నిక ప్రచారం ఈసారి కొత్త పుంతలు తొక్కనుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్ నుంచి ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. డిసెంబర్ 7న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. హోరాహోరీ యుద్ధంలో సామాజిక మాద్యమాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ పాటికే నిర్ణయానికి వచ్చారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి సోషల్ మీడియానే కీలక పాత్ర పోషించింది. దాన్ని దృష్టిలోపెట్టుకునే ఈసారి సామాజిక మాద్యమాల ద్వారా ఓటర్లకు చేరువకావాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. కాంగ్రెస్ ఈపాటికే దీనిపై ఓ కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. అధికార బీజేపీ ఎంత తక్కువ తినలేదు.
రాష్ట్రంలో ఏకంగా ఓ ఐటీ సెల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు రాజస్థాన్ బీజేపీ సోషల్ మీడియా సెల్ ఇన్‌చార్జి హీరేంద్ర కౌశిక్ వెల్లడించారు. డివిజన్ స్థాయిలో వాట్సప్, ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రచారాన్ని హోరెత్తిస్తామని ఆయన స్పష్టం చేశారు. పది మందితో ఐటీ బృందాలు, బూత్‌ల స్థాయిలో ఐటీ నిపుణులను రంగంలోకి దించుతామన్నారు. బీజేపీ చేపట్టిన పథకాలు, కార్యక్రమాలపై ప్రజల్లో ముఖ్యంగా యువత, మహిళలకు అవగాహన కల్పించేందుకు సోషల్ మీడియా సేవలు ఉపయోగించుకుంటామన్నారు. 14.5 లక్షల మందిని వాట్సప్ ద్వారా, 6.5 లక్షల మందిని ఫేస్‌బుక్ ద్వారా దగ్గరవుతామన్నారు. ముఖ్యమంత్రి వసుందరరాజే ఇప్పటికే 35 లక్షల మందితో ఫేస్‌బుక్‌తో అనుసంధానమై ఉన్నాయరని కౌశిక్ వెల్లడించారు. ఈసారి డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రజలకు చేరువై బీజేపీ వైఫల్యాలను ఎండగడతామని కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్ ఇన్‌చార్జి అర్చనా శర్మ తెలిపారు. తమ పార్టీపై బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారం, దాడులను సమర్ధవంతంగా తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నామని ఆమె ప్రకటించారు. బీజేపీలా బురద జల్లే కార్యక్రమానికి కాకుండా మంచి ఉద్దేశంతో ప్రజలకు అవగాహన కల్పించేందుకు సమయాత్తంగా ఉన్నామని అర్చనాశర్మ తెలిపారు. మరోపక్క రాజస్థాన్ ఎన్నికల బరిలో తొలిసారి దిగుతున్న ఆమ్‌ఆద్మీ పార్టీ కూడా దేవేంద్రదేవ్‌ను సోషల్ మీడియా ఇన్‌చార్జిగా నియమించింది. ఆప్ పోటీ చేసే ప్రతి నియోజకవర్గంలోనూ ఓ ఐటీ మేనేజర్‌ను నియమిస్తారు. ఓ వాట్సప్ హెల్ప్‌లైన్‌ను ఆప్ ఏర్పాటు చేస్తోంది.