జాతీయ వార్తలు

కేరళ ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, అక్టోబర్ 8: శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల ఆడవాళ్లూ ప్రవేశంచవచ్చన్న సుప్రీం కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ పోరాటాలు చేసేవారిపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సోమవారం నాడు విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ తీరుతోనే సమస్య జటిలం అవుతోందని కాంగ్రెస్ నేత రమేష్‌చెన్నితల ఆరోపించారు. ఈ వివాదం అత్యంత బాధాకరమని ట్రావన్‌కోర్ రాజకుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. కాగా కేరళ ప్రజల ఐక్యతను, లౌకక వాదాన్ని దెబ్బతీసేందుకే విపక్షాలు ఉద్దేశ్యపూర్వకంగా ఈ గొడవను సృష్టించాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆరోపించారు. రాష్ట్రంలోని వివిధ మతాలకు చెందిన ప్రార్థనామందిరాలు, ఆలయాలకు సంబంధించి అన్ని వర్గాల ప్రజల విశ్వాసాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తుందని ఆయన చెప్పారు. రాజకీయంగా సృష్టించిన ఇలాంటి వివాదాలకు కట్టుబడి రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడేలా చేయడానికి తాను సిద్ధంగా లేనని ఆయన అన్నారు. ఇటీవల రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వరదల సందర్భంగా ప్రజలంతా ఏకతాటిపై నిలిచి విపత్తును ఎదుర్కొన్న తీరు అపూర్వమని, అలాంటి ఐక్యతను, లౌకికవాదాన్ని నాశనం చేసేందుకే శబరిమల గొడవను సృష్టిస్తున్నారని ఆయన అన్నారు. ఐనా సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో ఏవైనా పొరబాట్లుంటే సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నామని, ఈదిశగా సంబంధిత అన్ని వర్గాలతో చర్చించదలిచామని పినరయి విజయన్ తెలిపారు. రాష్ట్రంలో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజలందరికీ సమన్యాయం అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, బీజేపీ నేతలు సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలను ఆయన ప్రస్తావిస్తూ మతతత్వ శక్తులతో చేయి కలపడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తనంతట తానే నాశనమవుతోందని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఆ పార్టీ రెండు నాల్కల ధోరణిని అవలంబిస్తోందని ఆయన అన్నారు, ఆపార్టీ నేత రమేష్ చెన్నితల తొలుత సుప్రీం కోర్టు తీర్పును ఆహానించి ఆ తర్వాత మాటమార్చారని సీఎం విజయన్ తెలిపారు. బీజేపీ పాలిత మహారాష్టల్రో అక్కడి ప్రభుత్వం సుప్రీం కోర్టు తీర్పు మేరకు హాజీ అలీదర్గాలోకి, శనిసింగనాపూర్‌లోనికి మహిళలను అనుమతించిన విషయాన్ని గుర్తు చేశారు.
ఇలావుండగా ట్రావన్‌కోర్ రాజకుటుంబ సభ్యురాలు గౌరీ లక్ష్మీబాయి ఈ విషయమై తొలిసారిగా స్పందిస్తూ శబరిమలను వివాదాస్పదం చేయడం చాలా బాధాకరమని అన్నారు. శబరిమలలో వందలాది సంవత్సరాల నుంచి అనుసరిస్తున్న సంప్రదాయాలను, కట్టుబాట్లను కాదనడం దారుణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు తీర్పుపై కనీసం పునస్సమీక్షకు సైతం రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించడం శోచనీయమని అన్నారు. సుప్రీం తీర్పును అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొన్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు. శబరిమల ప్రధానార్చకుడు (తంత్రి) ప్రభుత్వ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టు తీర్పుపై సమీక్షకు వెళ్లాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు.
వివాదాన్ని పెంచుతోంది: కాంగ్రెస్
కాగా శబరిమల వివాదాన్ని రాష్ట్రంలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం పెంచిపోషిస్తోందని విపక్ష కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితల పేర్కొన్నారు. ఇతరుల మనోభావాలను గాయపరిచే విధంగా తమ పార్టీ ఏవర్గానికీ మద్దతు ఇవ్వడం లేదని అన్నారు. గతంలో ఊమెన్‌చాందీ ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం హైకోర్టుకు అఫిడవిట్ సమర్పిస్తూ శబరిమలలోని కట్టుబాట్లు, పూజావిధానాలను, భక్తుల విశ్వాసాలను కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం భిన్నంగా వ్యవహరిస్తోందన్నారు.