జాతీయ వార్తలు

కర్నాటక నుంచి మోదీ పోటీ చేయరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, అక్టోబర్ 8: వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ కర్నాటక నుంచి పోటీ చేస్తారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యడ్యూరప్ప స్పష్టం చేశారు. నవంబర్‌లో జరిగే మూడు లోక్‌సభ, రెండు అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక బుధవారం జరిగే పార్టీ కోర్‌కమిటీలో నిర్ణయిస్తామని ఆయన చెప్పారు. దక్షిణాదిన బీజేపీని బలోపేతం చేసే ఉద్దేశంతో మోదీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కర్నాటక నుంచి పోటీ చేస్తారని వస్తున్న వార్తలపై ఆయన మాట్లాడుతూ ఇదంతా కేవలం కల్పితమని, మోదీ దక్షిణాది నుంచి పోటీచేసే ప్రసక్తే లేదని అన్నారు. దక్షిణాదిలోని ఏ రాష్ట్రంలోనూ ప్రస్తుతం బీజేపీ అధికారంలో లేదు. అయితే గతంలో ఆ పార్టీ కర్నాటకలో అధికారంలో ఉంది, ఆ రాష్ట్రంలోనే ఆ పార్టీ బలంగా ఉన్న నేపథ్యంలో దక్షిణాదిన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు, పార్టీ కేడర్‌లో ఉత్సాహాన్ని నింపేందుకు మోదీ కర్నాటక నుంచి పోటీ చేస్తారని మీడియాలో పలు కథనాలు వచ్చాయి. దానిని యడ్యూరప్ప ప్రస్తావిస్తూ ఇదంతా మీడియా సృష్టేనని అన్నారు. ఉప ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎంపికపై బుధవారం సమావేశమవుతామని, అక్కడ అభ్యర్థులను నిర్ణయించి, వారి పేర్లను అధిష్టానానికి పంపుతామని ఆయన చెప్పారు. అభ్యర్థుల ఎంపికై ఈరోజు, రేపు కూడా పలువురు నేతలతో చర్చలు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. కాగా కర్నాటకలోని మూడు లోక్‌సభ స్థానాలైన శివమొగ్గ, బళ్లారి, మంద్యలకు, అసెంబ్లీ స్థానాలైన రామనగర్, జామ్‌ఖండిలకు నవంబర్ మూడున ఉప ఎన్నికలు జరగనున్నాయి. వాటికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ఆరున జరుగుతుంది. ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యడ్యూరప్ప శివమొగ్గలో, బి.శ్రీరాములు బళ్లారిలో, జేడీఎస్‌కు చెందిన సిఎస్ పుట్టరాజు మంద్య నుంచి ఎంపీ పదవులకు రాజీనామాలు చేయడంతో ఈ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.