జాతీయ వార్తలు

ఎవరూ వెళ్లకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, అక్టోబర్ 8: రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొందని, ఎవరూ భయపడాల్సిన పనిలేదని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ విజ్ఞప్తి చేశారు. అలాగే ఎవరూ వలసవాదులెవరూ రాష్ట్రం విడిచి వెళ్లవద్దనని ఆయన కోరారు. అత్యాచారం ఘటన నేపథ్యంలో దాడులు జరడంతో భయపడ్డ బిహారీ వలసవాదులు సొంత రాష్ట్రానికి వెళ్లిపోయారు. వారం రోజుల్లోనే 20 వేల మంది బిహారీ వలసవాదులు గుజరాత్ నుంచి వెళ్లిపోయారని సంస్థ వెల్లడించింది.‘రాష్ట్రంలో గత 48 గంటల్లో ఎక్కడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలూ జరగలేదు’అని సీఎం రూపానీ వెల్లడించారు. వలసవాదులు ఎక్కువగా ఉంటే పారిశ్రామిక వాడల్లో అదనపుబలగాలు మోహరించినట్టు గుజరాత్ హోమ్‌మంత్రి ప్రదీప్‌సిన్హా జడేలా స్పష్టం చేశారు. గతనెల 28న 14 ఏళ్ల మైనర్‌పై జరిగిన అత్యాచారం ఘటనతో ఉత్తర గుజరాత్ జిల్లాలో హింసాత్మక ఘటనలు జరిగాయి. సబర్‌కాంతా జిల్లాలో జరిగిన అత్యాచారం ఘటన ఆరు జిల్లాలను కుదిపేసింది. హిందీ మాట్లాడే వారిపై దాడులు చోటుచేసుకున్నాయి. హింసకు పాల్పడ్డ 400 మందిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. రేప్ ఆరోపణలపై బిహార్ నుంచి వచ్చిన వ్యక్తిపై జరిగిన దాడితో పరిస్థితి అదుపుతప్పిందని వారన్నారు. కాగా హిందీ మాట్లాడే 20 వేల మంది గుజరాత్ వదలి సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారని ‘ఉత్తర భారతీయ వికాస్ పరిషత్’ అధ్యక్షుడు మహేశ్ సిన్హా కుష్వా వెల్లడించారు. దాడులకు భయపడి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్ వలసవాదులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని పారిపోయారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా ఉండగా రాష్ట్రంలో ఎవరూ ఎలాంటి అభద్రకు లోనుకావద్దని, పరిస్థితులు అదుపులోకి వచ్చాయని ముఖ్యమంత్రి విజయ్ రూపానీ విజ్ఞప్తి చేశారు. ‘పోలీసుల జోక్యంతో పరిస్థితులు చక్కబడ్డాయి. గత 48 గంటల్లో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటుచేసుకోలేదు’అని ఆయన వెల్లడించారు. శాంతి భద్రతలు చక్కదిద్దడానికి తాము కృషి చేస్తున్నామని, ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే పోలీసులను ఆశ్రయించాలన్న రూపానీ అలాంటివారికి ప్రభుత్వం భద్రత కల్పిస్తుందని రాజ్‌కోట్ నుంచి సీఎం భరోసా ఇచ్చారు.
రాష్ట్ర హోమ్‌మంత్రి జడేజా సోమవారం మీడియాతో మాట్లాడుతూ గుజరాత్‌లోని పరిస్థితులపై కేంద్రానికి నివేదించినట్టు స్పష్టం చేశారు. హింసాత్మక ఘటనలకు సంబంధించి 56 ఎఫ్‌ఐఆర్‌లను నమోదుచేసి 431 మందిని అరెస్టు చేసినట్టు గాంధీనగర్‌లో మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయామన్న నిరాశతోనే కొందరు వీటిని ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్‌ను ఉద్దేశించి హోమ్‌మంత్రి ధ్వజమెత్తారు. వలసవాదులపై దాడులను జడేజా తీవ్రంగా ఖండించారు. పరిస్థితి చక్కదిద్దడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రజలెవరూ వదంతులు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.