జాతీయ వార్తలు

తెలంగాణ నుంచి లింక్ ఎక్స్‌ప్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 8: సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్-ముద్కెడ్-ఆదిలాబాద్-నాగ్‌పుర్ మీదుగా నేరుగా ఢిల్లీకి లింక్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించాలని రైల్వేబోర్డు చైర్మన్ అశ్విన్ లోహణికి పార్లమెంట్ సభ్యుడు వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. సోమవారం రైల్వేబోర్డు చైర్మన్‌ను కలిసిన ఆయన ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, మెదక్, మేడ్చేల్ జిల్లాల్లోని ప్రజలు ఢిల్లీకి వెళ్లాలాంటే హైదరాబాద్ లేకపోతే ఖాజీపెట్ వెళ్లి, అక్కడి నుంచి దేశ రాజధానికి ప్రయాణం కావాల్సి వస్తున్నదని పేర్కొన్నారు.
ఇటీవల పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వేలైను, ముద్కెడ్-ఆదిలాబాద్-నాగ్‌పుర్ రైల్వేలైను పూర్తియినందున ఢిల్లీకి నేరుగా ప్రత్యేకంగా లింక్ రైలును వెయ్యాలని విజ్ఞప్తి చెసినట్టు వినోద్‌కుమార్ చెప్పారు. ఈ రైలు కరీంనగర్-జగిత్యాల-కోరుట్ల-మెట్‌పల్లి-ఆర్ముర్ మీదుగా నిజామాబాద్ వరకు కోన్ని బోగీలు,సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ కామారెడ్డి మీదుగా నిజామాబాద్ వరకు కోన్ని బోగీలను ఏర్పాటు చేసి నూతనంగా కొత్త రైలును నడపాలని రైల్వేబోర్డు చైర్మన్‌ను విజ్ఞప్తి చేసినట్టు వినోద్ కుమార్ తెలిపారు.