జాతీయ వార్తలు

- సునంద మృతి కేసు - తరర్‌ను ప్రశ్నించిన సిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ భార్య సునందా పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పాకిస్తాన్‌కు చెందిన జర్నలిస్టు మెహర్ తరర్‌ను విచారించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తరర్‌ను సిట్ ఫిబ్రవరిలో ఆమె కోరుకున్న ప్రదేశమైన ఢిల్లీలోని ఒక ప్రముఖ హోటల్‌లో విచారించినట్లు విశ్వసనీయ వర్గాలు సోమవారం తెలిపాయి. తరర్ పాకిస్తాన్ జాతీయురాలు అయినందున సిట్ ఆమెకు సమన్లు జారీ చేయలేకపోయింది. అయితే సునంద మృతి చెందటానికి కొన్ని గంటల ముందు ఆమెకు, తరర్‌కు ట్విట్టర్‌లో వాగ్యుద్ధం జరిగింది. దీంతో ఈ విషయంలో తాను విచారణను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని తరర్ అప్పట్లో ప్రకటించారు. ఇదే విషయాన్ని ఆమె సీనియర్ పోలీసు అధికారికి రాసిన లేఖలో పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా ఆమె సిట్ విచారణకు హాజరయ్యారు. రెండు గంటల సేపు సాగిన ఈ విచారణలో శశి థరూర్, అతని భార్య సునందతో తరర్‌కు ఉన్న సంబంధం గురించి, ట్విట్టర్‌లో సునందతో ఆమెకు జరిగిన పోరు గురించి, సునంద మృతికి సంబంధించిన ఇతర అంశాల గురించి తరర్‌ను ప్రశ్నించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. అయితే థరూర్, సునందలతో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి సన్నిహిత సంబంధాలు లేవని తరర్ పేర్కొన్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. సిట్ రూపొందించిన ఒక ప్రశ్నావళిని కూడా నింపాలని తరర్‌ను ఆదేశించినట్లు ఆ వర్గాలు తెలిపాయి.